Face Check: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి చిన్న చిన్న అంశాలకు కూడా ఎక్కడలేని ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరూ పట్టించుకోని అంశాలను సైతం పెద్దగా చూపిస్తున్నారు కొందరు. సోషల్ మీడియాతో సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే అదే సమయంలో ఫేక్ న్యూస్ కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. అసలు విషయం వేరేదై ఉంటే దానిని మరోలో ప్రొజెక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇలాంటి వార్తే ఒకటి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలో భాగంగా ఉచితంగా ‘ఆక్స్‌ఫర్డ్’ డిక్షనరీలను అందించింది. అయితే ఇందులో దేవుడు అనే పదానికి ఉన్న అర్థం విషయంలో రచ్చ మొదలైంది. ఈ డిక్షనరీలో దేవుడు అనే పదానికి అర్థం.. క్రైస్తవ మతాన్ని ఊటంకిస్తూ ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం క్రైస్తవ మత ప్రచారంలో భాగంగానే ఇలా అర్థాన్ని మార్చి అచ్చు వేయించిందంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి. దీంతో ఎట్టకేలకు ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. అధికారిక ప్రకటన చేశారు. ‘Factcheck.AP.Gon.in’ ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
#FactCheck The malicious propaganda with a video claiming, that the AP Govt. has changed the “definition of God” in Oxford Dictionary given free of cost as part of #JaganannaVidyaKanuka, stays busted.
Watch the video till the end. (Use Headphones) pic.twitter.com/7TfLSWjLnv
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) October 5, 2021
ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అందించిన డిక్షనరీతో పాటు, మార్కెట్లో అందుబాటులో ఉన్న డిక్షనరీని పక్కపక్కన ఉంచి.. రెండింటిలో ‘గాడ్’ అనే పదానికి ఉన్న అర్థాన్ని వివరించారు. ఈ రెండు డిక్షనరీల్లోనూ ఆ పదానికి ఒకే అర్థం ఉందని తెలిపారు. దీంతో ఏపీ ప్రభుత్వం దేవుడి అర్థాన్ని మార్చిందంటూ జరుగుతోన్న పుకారుకు చెక్ పడినట్లు అయ్యింది.
Also Read: Manchu Vishnu: ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్.. ఫ్యామిలీని లాగొద్దంటూ సీరియస్..
Viral Video: రోడ్డుపై లారీని ఆపిన గజరాజు.. లారీ పైకెక్కిన క్లీనర్ .. తర్వాత..