Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా ఏం జంతువు కనిపిస్తోంది.! అదే మీ ఆధిపత్య లక్షణం..

|

Jun 13, 2022 | 9:20 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు/పెయింటింగ్స్ నెటిజన్ల బుర్రకు పదునుపెడుతున్నాయి. వాటిని సాల్వ్ చేసేందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు.

Viral Photo: ఈ ఫోటోలో మొదటిగా ఏం జంతువు కనిపిస్తోంది.! అదే మీ ఆధిపత్య లక్షణం..
Twitter
Follow us on

ఆప్టికల్ ఇల్యూషన్.. ఇవి కేవలం పెయింటింగ్స్ మాత్రమే కాదు.. మీ వ్యక్తిత్వాన్ని చెప్పేసే సైకలాజికల్ టెస్ట్ కూడా. వీటిని విరివిగా సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు.. వాళ్ల పేషెంట్స్ మనస్సు, ఆలోచనలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు/పెయింటింగ్స్ నెటిజన్ల బుర్రకు పదునుపెడుతున్నాయి. వాటిని సాల్వ్ చేసేందుకు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతున్నారు. సోషల్ మీడియాలో వీటికంటూ ప్రత్యేకంగా పేజీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మీరు ఏ ఫోటోను చూసినా.. వాటిని చూసే దృక్కోణం మన వ్యక్తిత్వాన్ని చెప్పేస్తుంది. మనం ఏం ఆలోచిస్తున్నామో బహిర్గతం చేసేస్తుంది. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ చిత్రం మీ ఆధిపత్య లక్షణాన్ని చెప్పేస్తుందట. అదేంటో చూసేద్దాం..

ఇవి కూడా చదవండి

జీబ్రాలు:

ఈ చిత్రంలో మొదటిగా అధిక సంఖ్యలో జీబ్రాలు చూసినట్లయితే.. మీరు ఆకర్షణీయమైన, హాస్యం, విసుగును ద్వేషించే వ్యక్తులని అర్ధం. అందరిలో ఒకరిగా ఉండాలనుకుంటారు. ఒంటరిగా ఉండటాన్ని అస్సలు ఇష్టపడరు. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, బాహ్య వ్యక్తిత్వాన్ని ఇతరులు ఆకర్షితులవుతారు.

సింహం:

మీరు మొదటిగా సింహాన్ని చూసినట్లయితే.. ఆహాకారంతో ఉన్నారని అర్ధం. మీ ధృడ సంకల్పం మిమ్మల్ని ఇతరుల నుంచి భిన్నంగా ఉండేలా చేస్తుంది. మీరు అందరికంటే భిన్నంగా ఉన్నప్పటికీ.. దేని గురించి పెద్దగా పట్టించుకోరని జర్నల్ చెబుతోంది. సింహం అనేది బలమైన, ఒంటరి నాయకుడిని సూచిస్తుంది. దానిని చూసిన వారు మొదట ఆధిపత్యం చెలాయిస్తారు. నాయకత్వాన్ని తీసుకునేందుకు ముందడుగు వేస్తారు. ఎక్కడా వెనక్కి జంకరు. అయితే మీ ఈ లక్షణం ఇతరులను మీతో కలిసేలా చెయ్యదు.

సింహం, జీబ్రాస్:

మొదటిగా సింహం, జీబ్రాస్ చూసినట్లయితే.. వినయం, ఆధిపత్యం మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తెలిసిన ఆదర్శవంతమైన నాయకులు మీరని అర్ధం.

జీబ్రా మీద కూర్చున్న పక్షి:

మీరు జీబ్రాపై కూర్చున్న పక్షిని చూసినట్లయితే.. పర్ఫెక్షనిస్ట్‌లు అని అర్ధం. ప్రతీ విషయం క్రమబద్దీకరణలో ఉండాలని మీరు కోరుకుంటారు. ప్రతీది పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. లేకపోతే దానికి విలువలేదని అనుకుంటారు.