Viral: మొదటిరాత్రే ముఖం చాటేసిన భర్త.. తీరా విషయం తెలిశాక భార్య ఫ్యూజులౌట్.!

|

Jun 21, 2022 | 12:45 PM

ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ‌కు డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తానొక ట్రైన్‌డ్‌ సర్జన్..

Viral: మొదటిరాత్రే ముఖం చాటేసిన భర్త.. తీరా విషయం తెలిశాక భార్య ఫ్యూజులౌట్.!
Marriage 1
Follow us on

ఈ మధ్యకాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. కేటుగాళ్లు తెలివి మీరిపోయారు. డబ్బులు కోసం ఎలాంటి ఎత్తుగడ వేయడానికైనా వెనుకాడటలేదు. తాజాగా అలాంటి ఓ సంఘటన ఇండోనేషియాలో జరిగింది. ఓ మహిళ చేసిన మోసానికి మరో మహిళ బలైపోయింది. ఇదేంటి అస్సలు అర్ధం కాలేదని ఆశ్చర్యపోతున్నారా.? ఇంతకీ ఆ కథేంటంటే..?

వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ‌కు డేటింగ్ యాప్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడు తానొక ట్రైన్‌డ్‌ సర్జన్ అని మాత్రమే కాకుండా బొగ్గు వ్యాపారం కూడా చేస్తున్నట్లు ఆమెకు చెప్పాడు. ఇక వీరిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడే అతడు ఓ చిన్న మెలిక పెట్టాడు. ఆమెను రహస్యంగా వివాహమాడాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ సౌత్ సుమత్రాలో కొనుగోలు చేసిన ఓ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఇంతవరకు ఆమెకు ఎక్కడా తనపై అనుమానం రాకుండా మేనేజ్ చేశాడు. అయితే ఇప్పుడే కథలో ట్విస్ట్ ఎదురైంది.

పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్‌ విషయాన్ని దాటవేస్తూ రావడమే కాకుండా.. అక్కడికి వెళ్లిన దగ్గర నుంచి భర్త.. ఆమెను కట్నం తీసుకురావాలని వేధించడం ప్రారంభించాడు. అలా సుమారు 16,537 పౌండ్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 15.7 లక్షలు) ఆమె ముట్టజెప్పింది. కాగా, భర్త డబ్బులు కోసం వరుసగా వేధింపులకు గురి చేస్తుండటం.. సదరు మహిళకు అనుమానమొచ్చి.. అతడిపై నిఘా పెట్టింది. అనంతరం ఆ మహిళకు షాకింగ్ విషయం బయటపడింది. పెళ్లైన పది నెలలకు ఆమె భర్త అబ్బాయి.. కాదు అమ్మాయి అని తెలుసుకుంది. డబ్బుల కోసం ఈ నాటకమాడారని.. తాను మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళ తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

ఈ స్టోరీ ఇంగ్లీష్‌లో చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి