Viral Video: తల్లికోసం వెతుకుతూ అలసిపోయిన గున్న ఏనుగు.. అడవి మధ్యలోనే నిద్రపోగా..

Viral Video: చిన్న పిల్లలు కనిపించకపోయినా, తప్పిపోయినా.. వారి తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు పడే వేదన అంతా ఇంతా కాదు. వారు కంటపడేంత...

Viral Video: తల్లికోసం వెతుకుతూ అలసిపోయిన గున్న ఏనుగు.. అడవి మధ్యలోనే నిద్రపోగా..
Baby Elephant

Edited By:

Updated on: Sep 08, 2022 | 10:13 AM

Viral Video: చిన్న పిల్లలు కనిపించకపోయినా, తప్పిపోయినా.. వారి తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులు పడే వేదన అంతా ఇంతా కాదు. వారు కంటపడేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టని పరిస్థితి ఉంటుంది. ఇంతటి ప్రేమానుబంధాలు.. మనుషులకే కాదు, జంతువుల్లోనూ ఉంటాయి. అనేక సందర్భాల్లో, అనేక వైరల్ వీడియోలో ఈ విషయాన్ని మనం గమనించే ఉంటాం. తాజాగా తమిళనాడులో ఓ గున్న ఏనుగు తన తల్లి నుంచి తప్పిపోయింది. నెలల వయసు మాత్రమే ఉన్న ఈ గున్న ఏనుగు చివరకు ఫారెస్ట్ అధికారుల కంట పడింది. దాంతో అలర్ట్ అయిన అధికారులు.. ఆ చిన్నారి ఏనుగును తల్లి ఏనుగు చెంతకు చేర్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానికి కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. అయితే, ఈ ప్రయత్నంలో భాగంగా అడవిలో గున్న ఏనుగుకు ప్రొటెక్షన్ కల్పిస్తూ తల్లి చెంతకు తీసుకెళ్తున్నారు. అడవిలో దాని వెంట నడుస్తూ వెళ్తున్నారు.

అయితే, తల్లికోసం సాగిస్తున్న వేటలో గున్న ఏనుగు అసలిపోయింది. పాపం దానికి నిద్రవచ్చినట్లుంది. దారి మధ్యలోనే నిద్రపోయింది. చిన్నారి ఏనుగు బాధను అర్థం చేసుకున్న ఫారెస్ట్ సిబ్బంది.. దాని నిద్రకు భంగం కలుగకుండా చూసుకున్నారు. ఏండ కొడుతుండగా.. ఫారెస్ట్ సిబ్బంది దానికి గొడుగు పట్టారు. గొడుగు సాయంతో దాని నిద్ర పాడవకుండా చూసుకున్నారు. ఇలా అది నిద్రించినంత సేపు అలాగే ప్రొటెక్ట్ చేశారు ఫారెస్ట్ సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుందని, చిన్నారి ఏనుగును తల్లి ఏనుగు చెంతకు చేర్చేందుకు ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలను ఆమె కొనియాడారు. కాగా, ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫారెస్ట్ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..