Viral Video: ఓరీ దేవుడో.. అనకొండతో ఆటలా..? పాము తలపై పాప్‌ సింగర్ డ్యాన్స్‌ ..! వీడియో వైరల్‌

మీరు చాలా రకాల డ్యాన్స్ వీడియోలను చూసి ఉంటారు. కానీ, ఒక డేంజరస్‌ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తోంది. సుమారుగా 30 మీటర్ల పొడవైన ఒక పెద్ద పాము తలపై నిలబడి ఒక లేడీ డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇది. ఇంటర్‌నెట్‌ వేధికగా ఇదే ఇప్పుడు సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. ఆ భారీ భయంకర అనకొండపై అమ్మాయి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Viral Video: ఓరీ దేవుడో.. అనకొండతో ఆటలా..? పాము తలపై పాప్‌ సింగర్ డ్యాన్స్‌ ..! వీడియో వైరల్‌
Dance On Anaconda

Updated on: Jan 03, 2026 | 3:54 PM

తైవానీస్ పాప్ స్టార్ జోలిన్ సాయ్ తన లేటెస్ట్‌ వరల్డ్‌ టూర్‌ షోతో సోషల్ మీడియాను ఊపేసింది. తైవానీస్ పాప్ సింగర్ జోలిన్ సాయ్ 30 మీటర్ల పొడవైన అనకొండ తలపై నిలబడి ప్రమాదకరమైన ప్రదర్శన ఇచ్చింది. ఆమె డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆమె తన ప్లెజర్ వరల్డ్‌ టూర్‌ సందర్భంగా ఈ డ్యాన్స్ చేసింది. ఇది డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు తైపీలో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవం ప్రతి రాత్రి సుమారు 40,000 మంది ప్రేక్షకులను ఆకర్షించింది. మొత్తం 120,000 మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి వచ్చారని తెలిసింది. ఇంతకీ ఆ పాము కథేంటో ఇక్కడ చూద్దాం..

తైవానీస్ పాప్ సింగర్‌ జోలిన్ సాయ్ ఆసియాలో అత్యంత సాహసోపేతమైన ప్రత్యక్ష ప్రదర్శనకారులలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు, ఆమె అనకొండ ఆకారంలో ఉన్న వేదికపై ప్రమాదకరమైన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. వైరల్ వీడియోలో ఆమె పెద్ద, కదిలే పాము ఆకారంలో ఉన్న స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తోంది. అవును అది నిజమైన పాము కాదు. స్టేజ్‌ సెటప్‌. 30 మీటర్ల పొడవైన పాము ఆకారంలో ఉన్న స్టేజ్‌పై నిలబడి ఆమె పాటలు పాడుతూ, డ్యాన్స్‌ చేసింది. ఈ అద్భుతమైన దృశ్యం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ పామును ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తరలించడానికి సిబ్బంది సభ్యులు సహాయం చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఆమెను ప్రశంసించడం కనిపిస్తుంది. చాలామంది ఈ ప్రదర్శనను సినిమాటిక్, ధైర్యం, ఆసియా పాప్ కచేరీలలో కొత్త బెంచ్‌మార్క్ అంటూ ప్రశంసించారు. కదులుతున్న పాముపై ఆమె పూర్తి కాన్ఫిడెన్స్‌తో డ్యాన్స్‌ చేయడం నిజంగానే ప్రేక్షకులకు సినిమా స్టంట్‌ని మించి కనిపించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఇకపోతే, తైవానీస్ మీడియా నివేదికల ప్రకారం, జోలిన్ సాయ్ ఈ ప్రపంచ పర్యటన కోసం దాదాపు 900 మిలియన్ తైవానీస్ డాలర్లు లేదా దాదాపు 2 బిలియన్ రూపాయలు (సుమారు 2 బిలియన్ రూపాయలు) ఖర్చు చేశారని సమాచారం. పాముతో పాటు, ఎద్దు, సీతాకోకచిలుక, పంది ఆకారాలలో కూడా కదిలే నిర్మాణాలు వేదికపై కనిపించాయి. ఈ మొత్తం ప్రదర్శనను ఒక ఫాంటసీ ప్రపంచంగా మార్చాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఒకరు దీనిని ఇది నిజమైన కొండచిలువానా? అంటూ షాక్‌ అవుతూ అడిగారు. పాము ఇంత పెద్దదిగా ఎలా ఉంటుంది? అంటూ మరికొందరు అడిగారు. చాలా మంది అభిమానులు ఈ షోను ఇప్పటివరకు చూడని అత్యంత అద్భుతమైన ఆసియా పాప్ కచేరీగా అభివర్ణించారు. జోలిన్ సాయ్ ధైర్యం, సృజనాత్మకతను ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.