భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. రతన్ టాటా మరణంపై ప్రపంచ దేశాల అధినేతలు సంతాపాలు తెలియజేస్తున్నారు. రతన్ టాటా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు. కానీ, అతను చేసిన సామాజిక సేవ, రచనలతో లెక్కలేనంత మందిని ప్రభావితం చేశాడు. ప్రజలు ఇప్పటికీ అనేక రకాలుగా నివాళులు అర్పిస్తూ ఆయనను స్మరించుకుంటున్నారంటే ఆయన ప్రజల హృదయాలను ఎలా పాలించాడో అంచనా వేయవచ్చు. తాజాగా సూరత్‌కు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్న రీతిలో టాటాకు నివాళి అర్పించారు. కాగా, ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విపుల్‌భాయ్ అనే వ్యాపారి స్వర్గీయ రతన్‌టాటాకు వినూత్నంగా నివాళులు అర్పించారు. దాదాపు 11 వేల వజ్రాలతో ఆయన చిత్రపటాన్ని రూపొందించి తనదైన శైలిలో నివాళులర్పించారు.11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ వీడియో చూడండి..
सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024
ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ సామ్రాజ్యాల్లో టాటా గ్రూప్ ఒకటి. గుండు సూది నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల వరకు, సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వ్యాపారంలో తనదైన ముద్ర వేసిన బ్రాండ్ టాటా అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. జేఆర్‌డీ టాటా నుంచి రతన్ టాటా వరకు టాటాల నేతృత్వంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది టాటా సంస్థ. దాదాపు 21 సంవత్సరాల పాటు టాటా గ్రూప్‌నకు నేతృత్వం వహించిన రతన్ టాటా.. 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అనారోగ్య కారణాల రిత్యా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9, 2024 అర్ధరాత్రి సమయంలో కన్నుమూశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..