Watch: బుర్జ్ ఖలీఫా పై నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందో తెలుసా..? మేఘాలపై నడవొచ్చు..! వీడియో చూస్తే అవాక్కే..

|

Aug 09, 2024 | 8:21 PM

ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారటంతో ఈ వీడియోపై కామెంట్ల వెల్లువ మొదలైంది. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా భవనం పై అంతస్తులో వర్షం కూడా ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. ఎందుకంటే మేఘాలన్నీ ఆ భవనం కిందే ఉన్నాయని అంటున్నారు. మరొకరు దీనికి సమాధానంగా.. మేఘాలు లేకుంటే కింద కనిపించే దృశ్యం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

Watch: బుర్జ్ ఖలీఫా పై నుంచి చూస్తే భూమి ఎలా ఉంటుందో తెలుసా..? మేఘాలపై నడవొచ్చు..! వీడియో చూస్తే అవాక్కే..
Burj Khalifa
Follow us on

బుర్జ్ ఖలీఫా గురించి వినే ఉంటారు. ప్రపంచం దృష్టిలో ఈ భవనం దాని ప్రత్యేకమైన నిర్మాణం, అద్భుతమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. దుబాయ్ లో ఉన్న ఈ బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇదొక్కటేనే కాదు.. బుర్జ్ ఖలీఫా పేరు మీద చాలా రికార్డులు ఉన్నాయి. దుబాయ్ వెళ్లినవాళ్లు తప్పకుండా ఈ బిల్డింగ్ ను సందర్శిస్తారు..వెళ్లనివాళ్లు ఆ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో చూసి ఆనందిస్తుంటారు. అయితే, బుర్జ్ ఖలీఫా కాదు, బుర్జ్ ఖలీఫా పై నుండి ప్రపంచ వీక్షణ ఎలా ఉంటుందో చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ అద్భుతమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకు 32 లక్షలకు పైగా వీక్షించారు. వేలాది మంది దీన్ని లైక్, షేర్ చేశారు.

బుర్జ్‌ ఖలీఫా భవనం ఇంజనీరింగ్ కోణం నుండి ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతారు. దీని ఎత్తు 828 మీటర్లు. అంటే 2,717 అడుగులు. ఈ బిల్డింగ్ మొత్తం 163 అంతస్తులను కలిగి ఉంది. అంత ఎత్తైన భవనం నుండి దిగువన దృశ్యం ఎలా ఉంటుంది? అక్కడ నుండి భూమి, దుబాయ్‌ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మహ్మద్ ఆకిబ్ Instagram వీడియోలలో చూపించారు.

ఇవి కూడా చదవండి

మహ్మద్ ఆఖీబ్ ఈ దృశ్యాన్ని ప్రపంచం ముందు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఎవరూ ఊహించని దృశ్యం కావడంతో అతని వీడియో కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. తెల్లటి మేఘాలు చుట్టుముట్టిన ఆకాశం మరో ప్రపంచంలా అనిపిస్తుంది. వీడియోలో, బుర్జ్ ఖలీఫా పై అంతస్తు నుండి క్రింది దృశ్యం చూపించారు. అందులో తెల్లటి మేఘాలు, నీలి ఆకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియోలో యువకుడు బాల్కనీ తలుపు తెరిచి కెమెరాను కిందకు చూపించాడు.. దాంతో దిగువ దృశ్యం మేఘాల ప్రపంచంలా కనిపిస్తుంది.

ఇంటర్‌నెట్‌లో వీడియో వైరల్‌గా మారటంతో ఈ వీడియోపై కామెంట్ల వెల్లువ మొదలైంది. దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా భవనం పై అంతస్తులో వర్షం కూడా ఎలాంటి ప్రభావం చూపదంటున్నారు. ఎందుకంటే మేఘాలన్నీ ఆ భవనం కిందే ఉన్నాయని అంటున్నారు. మరొకరు దీనికి సమాధానంగా.. మేఘాలు లేకుంటే కింద కనిపించే దృశ్యం ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. మొత్తానికి వీడియో మాత్రం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..