AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రోడ్డు పక్కన దొరికే జ్యూస్ తాగుతున్నారా? ఒక్కసారి ఈ సీన్ చూడండి..!

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో రోడ్డు పక్కన లభించే జ్యూస్‌ల నాణ్యతపై తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తోంది. జ్యూస్ తయారీలో అపరిశుభ్రమైన నీటిని కలపడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం కావడంతో, బయట జ్యూస్ తాగేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. అధికారులు ఆహార భద్రతపై తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral Video: రోడ్డు పక్కన దొరికే జ్యూస్ తాగుతున్నారా? ఒక్కసారి ఈ సీన్ చూడండి..!
Street Juice Alert
Balaraju Goud
|

Updated on: Aug 27, 2026 | 1:17 PM

Share

వేసవి కాలమైనా, శీతాకాలమైనా ఆరోగ్యం కోసం చాలామంది తాజా పండ్ల రసాలను తాగుతుంటారు. ముఖ్యంగా రోడ్డు పక్కన లభించే సీజనల్ జ్యూస్‌లను ఎంతోమంది ఇష్టంగా తీసుకుంటారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇప్పుడు బయట విక్రయించే జ్యూస్‌ల నాణ్యతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. జ్యూస్ తయారు చేసే సమయంలో విక్రేత నీటిని కలుపుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైరల్ వీడియోను ఓ వ్యక్తి తన ఇంటి బాల్కనీ నుంచి రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. వీడియోలో రోడ్డు పక్కన సీజనల్ జ్యూస్ విక్రయిస్తున్న ఓ వ్యక్తి ఎర్రటి బకెట్ తరహా పాత్ర నుంచి నీటిని తీసుకుని జ్యూస్‌లో కలుపుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో గ్లాసు జ్యూస్‌లో ఎక్కువ మొత్తంలో నీటిని కలుపుతున్నాడని వీడియో తీసిన వ్యక్తి ఆరోపించారు.

అయితే ఆ నీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది తాగేందుకు సురక్షితమైనదేనా? అనే విషయాలు మాత్రం వీడియో ద్వారా స్పష్టంగా తెలియడం లేదు. నీటి నాణ్యతపై ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఈ దృశ్యాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కలుషిత నీటిని ఉపయోగిస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. బయట జ్యూస్ తాగే ముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. రోడ్డు పక్కన విక్రయించే ఆహారం, పానీయాల నాణ్యతను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఈ ఘటనను చూసి బయట దొరికే ప్రతి జ్యూస్‌ను కల్తీగా భావించకూడదని, వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి వాడుతున్న నీరు నిజంగా కలుషితమైనదని నిర్ధారించే ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన పూర్తి నేపథ్యం, ప్రదేశం, విక్రేత వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అందువల్ల వీడియో ఆధారంగా తుది నిర్ధారణకు రావడం కంటే, సంబంధిత అధికారులు ఆహార భద్రతా ప్రమాణాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us