Viral Video: వామ్మో.. అప్పటివరకు బానే ఉంది.. అంతలోనే ఈ కుక్కకు ఏమైంది..

వామ్మో.. ఈ రోజుల్లో వీధి కుక్కల్ని నమ్మడానికి లేకుండా పోయింది. ప్రేమతో వాటిని దగ్గర తీద్దామన్న ఆలోచించే రోజులు వచ్చాయి. ఈ వీడియో చూస్తే మూగజీవాల్ని ప్రేమించేవారు కూడా కుక్కల్ని చేరదీశేందుకు ఒకటికి.. రెండు సార్లు ఆలోచిస్తారు.

Viral Video: వామ్మో.. అప్పటివరకు బానే ఉంది.. అంతలోనే ఈ కుక్కకు ఏమైంది..
Stray Dog Attack
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 07, 2024 | 5:44 PM

కుక్కల ప్రవర్తన గురించి మనల్ని అప్రమత్తం చేసే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో, ఒక వ్యక్తి వీధికుక్కపై ప్రేమను కురిపించడాన్ని చూడవచ్చు, కానీ కొద్ది క్షణాల తర్వాత కుక్క మూడ్ మారిపోతుంది. ఏం చేయకుండానే.. అదే వ్యక్తిపై అది దాడికి దిగింది. ఈ ఘటన కుక్కల్లో కూడా మూడ్ స్వింగ్స్‌ని స్పష్టం చేస్తోంది.  ముఖ్యంగా వీధికుక్కల విషయంలో.. వాటి ప్రవర్తనను ముందుగానే అంచనా వేయడం ముఖ్యం.

వీడియోని గమనిస్తే.. రొడ్డు పక్కన కొన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే ఓ వ్యక్తి నిల్చుని ఎవరో కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వీధి కుక్క తన వద్దకు రావడంతో.. అతడు ప్రేమగా దాన్ని నిమిరాడు. దీంతో ఆ కుక్క తోక ఊపుతూ తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. కొంతసేపు అలా నిమిరిన తర్వాత అది అతని పైకి ప్రేమగా ఎక్కింది. ఆ తర్వాత కూడా దాన్ని కాసేపు ప్రేమగా నిమిరాడు అతను. అలా నిమిరుతూ దాన్ని కిందకి దించాడు. కానీ ఏమైందో ఏమో.. ఒక్కసారిగా ఆ కుక్క ప్రవర్తన మారిపోయింది. ఆ వ్యక్తిపైకి అగ్రెసీవ్‌గా దూసుకెళ్లింది. కరిచేందుకు యత్నించింది. ఆ వ్యక్తి ఎలాగోలా దాన్ని నుంచి తప్పించుకున్నాడు కానీ అప్పటికే చేతికి గాయమైంది. ఈ వీడియోను చూసి నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. క్షణాల వ్యవధిలో ఆ కుక్క అలా ఎందుకు మారిపోయిందా అర్థం కాక నివ్వెరపోతున్నారు.

వీడియో దిగువన చూడండి..

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో @wtf.batshonline అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను ఒక్కరోజులోనే రెండు కోట్లకు పైగా వీక్షించారు. వామ్మో.. నేను ఇకపై వీధి కుక్కలకు దూరంగా ఉంటాను అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.