
కొన్ని వీధుల్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరుపై దాడి చేస్తూ తరచుగా గాయపరుస్తున్న వార్తలు వింటూనే ఉన్నాం. వీధి కుక్కల బారి నుంచి తమని రక్షించమని వాటిని నిర్మూలించమని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వీధి కుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు.. హైదరబాద్, బెంగళూరు, పూనే వంటి పెద్ద పెద్ద నగరాల్లో నివసించే యువతీయువకులు వీధి కుక్కలను చేరదీసి.. వాటికీ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఇలా జాలితో వీధి కుక్కలను చేరదీయడం వారి ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు ఎంత ప్రేమ చూపించినా అవి దాడి చేస్తే.. రేబిస్ సోకే ప్రమాదం ఉందని.. ఒకొక్క సారి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రేబిస్ వ్యాధి సోకితే ఆ వ్యక్తి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియజేస్తూ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో ఒకటి కబాడీ క్రీడాకారుడు బ్రిజేష్ సోలంకి చెందినది.
యూపీకి చెందిన 22 ఏళ్ల బ్రిజేష్ సోలం ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. బ్రిజేష్ సోలంకి ఒక వీధి కుక్కను రక్షించాడు. అయితే మురికి నీటి లో పడిన ఓ కుక్కని రక్షించాడు. ఆ కుక్కే బ్రిజేష్ ని కరిచింది. అయితే ఈ విషయం అతను గమనించ లేదు.. తన చేతిమీద గాయం కబాడీ ఆడుతున్న సమయంలో తగిలిందని భావించాడు. దీంతో అతనికి రేబిస్ వ్యాధి సోకింది. ఎంత వైద్యం చేసినా వైద్యులు రేబిస్ వ్యాధిని నయం చేయలేకపోయారు. చివరకు బ్రిజేష్ నీటిని చూసి భయపడడం, కుక్క మాదిరి పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తమ కొడుకు పరిస్థతి చూసి ఆహాయ స్థితిలో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చివరికి ఆ వ్యాధే అతడి ప్రాణాలు తీసింది. బ్రిజేష్ చివరి సమయంలో పడిన బాధకి సంబంధించిన ఒక వీడియోనూ మేఘ్ అప్డేట్స్ అనే ఎక్స్ హ్యాండిల్లో యూజర్ పోస్ట్ చేశారు.
Stray dog lovers, watch this young girl & an international kabbadi player with rabies. If this doesn’t break your heart, nothing will.
Rabies can be cured if treatment starts before symptoms appear involving rabies vaccine and rabies immunoglobulin.
A slight delay & painful… pic.twitter.com/ZvJ9xWlJlB
— Megh Updates 🚨™ (@MeghUpdates) August 11, 2025
ఈ వీడియోకి జతగా రేబిస్ సోకిన మరొక యువతికి సంబంధించిన వీడియో కూడా ఉంది. అందులో రేబీస్ సోకినా యువతి మంచానికి కట్టేసి ఉంది. ఆమె గిల గిలా కొట్టుకుంటుంది. కూతురు పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఒక పక్కన నిలబడి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కనుక అయ్యో పాపం అంటూ వీధికుక్కలను చేర దీసే ముందు జాగ్రత్తగా ఉండండి. లేదంటే… అవి రేబీస్ వ్యాధి రూపంలో మీ ప్రాణాలను అత్యంత దారుణంగా హరించే అవకాశం ఉంది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..