Snake: చూశారా మీరు ఇలాంటి పాముని.. గాలి వాన వచ్చినా కదలికే లేదు..
ఈ పామును చూడగానే తొలుత మీరు నివ్వెరపోయి ఉంటారు. చూడటానికి నాగుపాము ఆకారంలో ఉంది..? పడగ విప్పి ఉంది. కానీ రంగు, సైజు మాత్రం విభిన్నంగా ఉన్నాయి.. మీకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఆగడాగండి.. మీకు దాని పుట్టు పూర్వోత్తరాలు వివరించబోతున్నాం...

అస్సాంలోని బజాలి జిల్లా తిట్కా ప్రాంతంలో ఒక వినూత్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. శివాలయం సమీపంలోని ఓ చెట్టును ఎండిన వరిగడ్డితో చేసి పెద్ద నాగుపాము కనిపిస్తోంది. ఆ పామును స్థానిక యువకులు తమ చేతులతోనే తయారు చేశారు. కారణం.. శివపూజకు ముందు ఆ చెట్టును ఎవరూ నరికేయకుండా కాపాడటమే. ఆ చెట్టుకు హాని చేయవద్దని ప్రజలకు గుర్తు చేయడానికి ఆ పామును ఓ సూచనగా వారు అక్కడ ఉంచారు. చెట్టు చుట్టూ వరిగడ్డితో అల్లిన ఆ నాగరూపం ఇప్పుడు గ్రామ గౌరవం అయిపోయింది. నెలలు గడిచాయి. జోరు వానలు, భీకర గాలులు ఎంత బలంగా వీచినా.. ఆ పాము మాత్రం ఇప్పటికీ దాని ఆకారం కోల్పోలేదు. కాలం గడిచినా అది అలాగే నిలిచి ఉంది. దీంతో ఇదంతా దేవుని మహిమ అంటున్నారు స్థానికులు.
Also Read: గంగమ్మకు మొక్కి వల వేసిన జాలరి.. చిక్కింది చూసి సంబరం..
“శివాలయం దగ్గర ఉన్న ఈ చెట్టును ఎవరూ హానిచేయరాదనే సందేశంతో పాము రూపం చేశాం. భగవాన్ శివుడి కటాక్షంతోనే ఇది నిలిచి ఉందని మా నమ్మకం” అని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ చెట్టు నీడలో కూర్చుని భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు. కొందరు ధ్యానం చేస్తున్నారు. ఇది విశ్వాసం, ప్రకృతి రెండూ కలిసిన అద్భుతం అంటున్నారు. కొందరు కొత్తగా అటువైపు వచ్చిన ఆ చెట్టు చుట్టూ ఉన్న పామును చూసి ఆశ్చర్యపోతున్నారు. వరిగడ్డితో చేసిన ఆ పాము చెట్టును మాత్రమే కాదు, మనుషుల మనసుల్లోని భక్తిని కూడా కాపాడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
