Viral Video: వాషింగ్ మిషన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఓపెన్ చేసిన ఇంటి ఓనర్.. ఒక్కసారిగా.!

Viral Video: బొద్దింక, బల్లి వంటి చిన్న చిన్న జీవులు సడన్‌గా కనిపిస్తే చాలు.. కొంతమంది భయపడిపోతారు. అలాంటిది ఒక పాము మనకు దగ్గరగా ఉంటే..

Viral Video: వాషింగ్ మిషన్ నుంచి వింత శబ్దాలు.. భయంతో ఓపెన్ చేసిన ఇంటి ఓనర్.. ఒక్కసారిగా.!
Washing Machine

Edited By:

Updated on: Sep 15, 2021 | 8:38 PM

బొద్దింక, బల్లి వంటి చిన్న చిన్న జీవులు సడన్‌గా కనిపిస్తే చాలు.. కొంతమంది భయపడిపోతారు. అలాంటిది ఒక పాము మనకు దగ్గరగా ఉంటే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇలాంటి పరిస్థితినే ఓ ఇంటి ఓనర్ ఎదుర్కున్నాడు. తాను నిత్యం ఉపయోగించే వాషింగ్ మిషన్‌లో వింత శబ్దాలు వస్తుంటే.. ఏమై ఉంటుందని భయపడ్డాడు. అలా భయంతోనే వాషింగ్ మిషన్ మూత(Lid) ఓపెన్ చేయగా.. అందులో బుసులు కొడుతున్న నాగుపాము నక్కి ఉండటం గమనించి ఒక్కసారిగా హడలిపోయాడు. వెంటనే అక్కడ నుంచి పరుగులు తీశాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల్ చెరువు గ్రామంలో నివసిస్తున్న కుంచే శ్రీనివాస్ రోజులాగే తన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయడానికి సిద్దమయ్యాడు. ఉతకాల్సిన బట్టలు, నీళ్లు అన్ని రెడీ చేసుకుని దాని దగ్గరకు రావడంతో.. వాషింగ్ మిషన్ నుంచి ఏవో వింత శబ్దాలు రావడం గమనించాడు. ఏదైనా పురుగు దూరి ఉంటుందేమోనని అనుమానపడ్డాడు. భయపడుతూనే దాని మూతను తెరవగా.. బుసలు కొడుతున్న నాగుపాము బయటికి వచ్చింది. దానిని చూసిన వెంటనే శ్రీనివాస్ బెంబేలెత్తిపోయి.. అక్కడ నుంచి పరుగులు పెట్టాడు. అతడి అరుపులకు చుట్టుప్రక్కల వారు కూడా చేరుకోవడంతో.. అందరూ కలిసి స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వర్మ.. ఘటనాస్థలానికి చేరుకొని వాషింగ్ మిషన్‌లో ఉన్న నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నాడు. దీనితో శ్రీనివాస్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

Read Also: బ్యాంకు ఎకౌంట్లోకి లక్షలు.. మోడీ పంపించారట.. తిరిగి ఇవ్వనంటూ మడత పేచీ! ఈ స్టోరీ వింటే నవ్వాలో.. జాలిపడాలో అర్ధం కాదు..

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే

వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్

Follow Us