పిట్ట బాగుందని టచ్‌ చేశారో అంతే సంగతి..! ఈకల్లో విషం.. తాకితే తప్పదు మరణం..!!

|

Apr 17, 2023 | 9:47 AM

విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది.

పిట్ట బాగుందని టచ్‌ చేశారో అంతే సంగతి..! ఈకల్లో విషం.. తాకితే తప్పదు మరణం..!!
Strange Birds Hide Poison
Follow us on

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మానవులకు కూడా దొరకని, అంతుచిక్కని జీవరాశులు ఎన్నో ఉన్నాయి. అయితే, ప్రపంచంలోని ప్రతి జీవికి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. పక్షులను తాకితేనే చనిపోయేంతటి ప్రమాదం ఉంటుందని ఇప్పటి వరకు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా..? ఎవరూ వినలేదనే అంటారు. కానీ, ఇలా ముట్టుకుంటే ప్రాణాపాయం కలిగించే పక్షులను గుర్తించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. వాటిని ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులను న్యూగినియా అడవుల్లో డెన్మార్క్‌ పరిశోధకులు గుర్తించారు. అవి వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు గుర్తించారు. వాటిని ఇంట్లో పెంచుకోలేం, ఆహారం ఇవ్వలేం. విషపూరిత పక్షుల సమీపంలోకి వెళ్లడం కూడా ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. ఈ టెర్రరిస్టులు రెండు రకాల విషపూరిత పక్షులు రిజెంట్‌ విజ్లర్‌(పచీసెఫాలా స్లీ్కగెల్లీ), రఫోస్‌–నేప్డ్‌ బెల్‌బర్డ్‌(అలిడ్రియాస్‌ రుఫినుచా) అనే పక్షి జాతులకు గుర్తించారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయని వెల్లడించారు.

పచ్చిసెఫలా ష్లెగెలి కాకిలా కూర్చుని ఉంటుంది. కానీ రంగు మాత్రం అనేక రంగులతో మిలితమై ఎంతో అందంగా ఉంటుంది. న్యూ గినియా అడవికి చెందిన ఈ పక్షులు తమ ఈకల్లో ప్రాణాంతకమైన విషాన్ని దాచుకుని జీవిస్తాయి. డెన్మార్క్‌కు చెందిన పరిశోధకులు కొత్త జాతి పక్షిని కనుగొన్నారు. విషపూరితమైన ఆహారాన్ని తిన్న తర్వాత వేగంగా విషంగా మారడం వీటి ప్రత్యేకత. ఈ విషం తమ శరీరంలోనే ఉన్నా.. ఈ పక్షులకు ఇతర సమస్యలు ఉండవని నేచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు చెబుతున్నారు. విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాకితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా క్షణాల వ్యవధిలోనే జరిగిపోతోంది.

ఈ పక్షులతో కొద్దిపాటి సంపర్కం కూడా మనుషుల ప్రాణాలను బలిగొంటుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ పక్షులు వెదజల్లే విషం దక్షిణ, మధ్య అమెరికాలో కనిపించే బంగారు విషం కప్పలా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై ప్రతిచోటా విషం దాగి ఉందనడానికి ఈ పక్షులే నిదర్శనం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..