Statue of Liberty: అమెరికాకు ఫ్రాన్స్ ఇచ్చిన బహుమతి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. 137 ఏళ్లు పూర్తి..

|

Oct 28, 2023 | 6:23 PM

ఈ విగ్రహం పాదాల వద్ద పడి విరిగిన సంకెళ్లు అణచివేత, దౌర్జన్యం నుండి స్వేచ్ఛకు చిహ్నం. విగ్రహం పొడవు 151 అడుగులు. ఎడమ చేతిలో ఉన్న నోట్ బుక్ 23.7 అడుగుల పొడవు. 13.7 అడుగుల వెడల్పుతో ఉంది. దానిపై అమెరికా స్వాతంత్ర్యం తేదీ జూలై 4, 1776 అని వ్రాయబడింది. విగ్రహం తలపైకి చేరుకోవడానికి లోపలి నుండి మెట్లు తయారు చేయబడ్డాయి.

Statue of Liberty: అమెరికాకు ఫ్రాన్స్ ఇచ్చిన బహుమతి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. 137 ఏళ్లు పూర్తి..
Statue Of Liberty
Follow us on

చాలా కాలంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పరిగణించబడుతున్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి 137  ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు భారతదేశంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ‘ విగ్రహం  సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచింది. కానీ గత కొంతకాలం క్రితం వరకూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికే ఈ ఘనత ఉండేది. ఈ విగ్రహానికి చాలా అద్భుతమైన చరిత్ర ఉంది. న్యూయార్క్‌ లోని మాన్‌హట్టన్ ప్రాంతంలోని లిబర్టీ ద్వీపంలో ఉన్న ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని అక్టోబర్ 28, 1886న అప్పటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌ల్యాండ్ ప్రారంభించారు. ఈ విగ్రహం అమెరికా, ఫ్రాన్స్ మధ్య స్నేహానికి చిహ్నం.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పూర్తి పేరు లిబర్టీ ఎన్‌లైట్నింగ్ ది వరల్డ్. దీనికి రోమన్ దేవత లిబర్టాస్ పేరు పెట్టారు. రోమన్ పురాణాల్లో ఈ దేవత స్వేచ్ఛకు చిహ్నంగా పరిగణించబడుతుంది. నేటికీ ఇది అమెరికాతో సహా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉంది. వేడి, వర్షం, తుఫానును తట్టుకుని ఈ విగ్రహం నిలబడి ఉంది. నేటికీ సగర్వంగా పర్యాటకులకు గర్వంగా నిలబడి ఠీవిని చూపిస్తోంది.  అయితే దీని రంగు ఖచ్చితంగా మారిపోయింది. అది ఒక ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. అమెరికన్ అధికారులు దీని రంగును ఇలాగే ఉంచాలని నిర్ణయించుకున్నారు.

అమెరికన్ స్వాతంత్ర్యానికి చిహ్నం

ఐక్యరాజ్యసమితి దీనిని 1984లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. 1984లో ప్రజల సందర్శనం నిలిపివేశారు. పునరుద్ధరణ తరువాత ఇది 1986 సంవత్సరంలో మళ్లీ తెరవబడింది. అదే సమయంలో శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. 9/11 దాడుల తర్వాత… మళ్లీ వంద రోజులు మూసివేశారు. 2004 వరకు తెరవలేదు. ఈ విగ్రహం అమెరికా స్వాతంత్ర్యానికి చిహ్నం. జులై 4, 1776 తేదీని విగ్రహం చేతిలో ఉన్న నోట్‌బుక్‌లో నమోదు చేశారు. అమెరికా, ఫ్రాన్స్ అనే రెండు దేశాలు సంయుక్తంగా నిర్మించిన ప్రపంచంలోని ఏకైక చారిత్రక విగ్రహం ఇదే. విగ్రహ తయారీకి పునాదికి అమెరికా వేయగా..  విగ్రహం తయారీ పని ఫ్రాన్స్ పూర్తి చేసింది.

ఇవి కూడా చదవండి

యుద్ధనౌకలో విగ్రహం అమెరికాకు తరలింపు

ఫ్రెంచ్ చరిత్రకారుడు, కవి, న్యాయనిపుణుడు ఎడ్వర్డ్ డి లాబౌల్లె 1865లో అమెరికా 100వ వార్షికోత్సవం కోసం విగ్రహాన్ని ప్రతిపాదించారు. ఫ్రెడరిక్ ఆగస్ట్ దీనిని రూపొందించారు. అతను అద్భుతమైన శిల్పి. దీని కోసం నిధుల సేకరణలో ఫ్రాన్స్ ప్రజలు సహకరించారు. దీని నిర్మాణం ఫ్రాన్స్‌లో 1875లో ప్రారంభమైంది. దీన్ని తయారు చేయడానికి దాదాపు తొమ్మిదేళ్లు పట్టింది. విగ్రహం సిద్ధం కాగానే దాన్ని అమెరికా తరలించే విషయంలో సమస్య మొదలైంది. అప్పుడు విగ్రహం మళ్లీ 350 వేర్వేరు భాగాలుగా విభజించారు. 214 పెట్టెల్లో ప్యాక్ చేసి అమెరికాకు పంపించారు. దీన్ని పంపేందుకు ఫ్రాన్స్ యుద్ధనౌక ఐసీరేను ఉపయోగించింది. జూన్ 17, 1885 న ఈ విగ్రహం ఫ్రాన్స్ నుండి బయలుదేరి అమెరికాకు చేరుకుంది. దీని నిర్మాణానికి 2.50 లక్షల అమెరికన్ డాలర్లు ఖర్చయ్యాయి.

విగ్రహం లోపల మెట్లు

ఈ విగ్రహం పాదాల వద్ద పడి విరిగిన సంకెళ్లు అణచివేత, దౌర్జన్యం నుండి స్వేచ్ఛకు చిహ్నం. విగ్రహం పొడవు 151 అడుగులు. ఎడమ చేతిలో ఉన్న నోట్ బుక్ 23.7 అడుగుల పొడవు. 13.7 అడుగుల వెడల్పుతో ఉంది. దానిపై అమెరికా స్వాతంత్ర్యం తేదీ జూలై 4, 1776 అని వ్రాయబడింది. విగ్రహం తలపైకి చేరుకోవడానికి లోపలి నుండి మెట్లు తయారు చేయబడ్డాయి. పర్యాటకులు 354 మెట్లు ఎక్కి అక్కడికి చేరుకోవచ్చు. కిరీటంలోని ఏడు కిరణాలు ఏడు ఖండాలను సూచిస్తాయి. ఒక్కో కిరణం పొడవు తొమ్మిది అడుగులు.

విగ్రహం బరువు ఎంతంటే

చేతిలో అమర్చిన టార్చ్ 1986 సంవత్సరంలో 24 క్యారెట్ల బంగారంతో కప్పబడి ఉంది. విగ్రహం మొత్తం బరువు 225 టన్నులు. భూమి నుండి మంట వరకు ఎత్తు 305.6 అడుగులు. ఇందులో రాగి, ఉక్కు షీట్లను ఉపయోగించారు. తలపై కిరీటంలో 35 కిటికీలు ఉన్నాయి. 10-10 మంది సమూహాలు మాత్రమే కిరీటం వద్దకు  చేరుకోవడానికి అనుమతిస్తారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు ప్రతిరోజూ దాదాపు 14-15 వేల మంది వస్తుంటారు, అయితే విగ్రహం లోపల ఉన్న మెట్లను ఉపయోగించి గరిష్టంగా 240 మందిని మాత్రమే పైకి చేరుకోవడానికి అనుమతిస్తారు.

విగ్రహం, పర్యాటకుల భద్రతా కారణాల దృష్ట్యా అనేక చర్యలు తీసుకుంటారు. ప్రతి బృందంతో పాటు ఒక ఉద్యోగి తప్పనిసరి. 1924లో అమెరికా దీనిని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించింది. విగ్రహాన్ని స్థాపించే సమయంలో ఈ ద్వీపం పేరు బెడ్లో. ఈ ద్వీపం పేరు 1956లో లిబర్టీగా మార్చబడింది. ప్రస్తుతం విగ్రహం కోసం 58 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..