Viral Video: మైదానంలో క్రీడా స్ఫూర్తిని చాటిన ఆటగాడు.. వీడియో చూస్తే మీరు కచ్చితంగా ఫిదా అవుతారు

క్రీడలో గెలిచినా.. ఓడినా క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం. అయినా గ్రౌండ్ లో దిగితే అవతలి టీమ్ ని ప్రత్యర్థిగానే చూస్తారు. గెలుపోటములను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తిని చాటే సందర్భాలు అరుదుగా చూస్తుంటాం.. అలాంటి అరుదైన సంఘటన బేస్ బాల్ సౌత్ వెస్ట్ రీజియన్ ఛాంపిచన్ షిప్ లో

Viral Video: మైదానంలో క్రీడా స్ఫూర్తిని చాటిన ఆటగాడు.. వీడియో చూస్తే మీరు కచ్చితంగా ఫిదా అవుతారు
Heartwarming
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 11, 2022 | 2:53 PM

Sportsmanship: క్రీడలో గెలిచినా.. ఓడినా క్రీడా స్ఫూర్తి ఎంతో అవసరం. అయినా గ్రౌండ్ లో దిగితే అవతలి టీమ్ ని ప్రత్యర్థిగానే చూస్తారు. గెలుపోటములను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తిని చాటే సందర్భాలు అరుదుగా చూస్తుంటాం.. అలాంటి అరుదైన సంఘటన బేస్ బాల్ సౌత్ వెస్ట్ రీజియన్ ఛాంపిచన్ షిప్ లో చోటచేసుకుంది. ఈ వీడియో అందరి మనస్సులను దోచుకుంటోంది. ఇంతకీ ఏం జరిగిందంటే. టెక్సాస్ ఈస్ట్, ఓక్లహోమా మధ్య జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న ఓక్లహోమా హిట్టర్ ఇసయ్య జే జార్విస్ కు టెక్సాస్ ఈస్ట్ బౌలర్ (పిచ్చర్) కైడెన్ షెల్టాన్ ఎంతో వేగంగా వేసిన బంతి తలపై తగిలింది. దీంతో ఇసయ్య జే జార్విస్ తల పగలడమే కాదు..తలపై ఉన్న హెల్మెట్ కింద పడిపోయింది. బాల్ తగిలిన దెబ్బకు బ్యాటర్ కాసేపు బాధపడ్డాడు. ఫిజియో వచ్చి చికిత్స చేశాడు. ఆతర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. బాల్ వేయడానికి పిచ్చర్ బాధపడుతూ.. తనలో తాను మదనపడుతున్నాడు. తాను వేసిన బాల్ తగిలి ఎంతపనయ్యిందో అంటూ కైడెన్ షెల్టాన్ తలపై చెయ్యి పెట్టుకుని బాధపడ్డాడు. ఇది చూసిన నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ఇసయ్య జే జార్విస్ పిచ్చర్ దగ్గరకు చేరుకుని ఓదార్చడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఇద్దరు ఆలింగనం చేసుకుంటూ.. బాధపడకులే అంటూ ఓదార్చాడే. ఇది చూసిన వారంతా క్రీడా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమంటూ ఇద్దరు క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బేస్ బాల్ లిటిల్ లీగ్ వరల్డ్ సిరీస్ ప్రతి సంవత్సరం కొన్ని అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. వాటిలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చే. క్రీడాకారులు చిన్న వయస్సులోనూ చాటిన క్రీడాస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆటగాళ్లంటే వీరేనని కొందరు.. కొట్టి ఏడుస్తున్నాడే అంటూ మరికొందరు ఈవీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. బేస్ బాల్ సౌత్ వెస్ట్ రీజియన్ ఛాంపిచన్ షిప్ లో టెక్సాస్ ఈస్ట్, ఓక్లహోమా మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ లోచివరికి టెక్సాస్ ఈస్ట్ జట్టు విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?