అయ్యో కొడుకా..! తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. నడిరోడ్డుపై కుప్పకూలిన కుమారుడు మృతి

లైక్ అహ్మద్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 20న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో మరణించారు. అక్కడి వైద్యులు అతని తండ్రి చనిపోయాడని ప్రకటించినప్పుడు, అతని కుమారుడు అతిక్ దానిని నమ్మడానికి నిరాకరించాడు. తండ్రిని ఎంతగానో ఇష్టపడే చిన్న కుమారుడు అతిక్ తండ్రి మరణవార్త విని గుండెలవిసేలా విలపించాడు. మృతదేహాన్ని ఇంటికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. అతిక్ బైక్‌పై బయలుదేరాడు.

అయ్యో కొడుకా..! తండ్రి మృతదేహాన్ని తరలిస్తుండగా.. నడిరోడ్డుపై కుప్పకూలిన కుమారుడు మృతి
Son Dies During Father's Funeral

Updated on: Mar 25, 2025 | 9:48 PM

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు గుండెపోటుతో మరణించాడు. ఇంతటి హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. కాన్పూర్‌లో తండ్రి మృతదేహాన్ని ఖననం చేయడానికి తీసుకెళ్తుండగా కొడుకు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. దాంతో తండ్రీకొడుకులను కలిసి ఖననం చేశారు కుటుంబ సభ్యులు, బంధువులు. ఈ సంఘటన స్థానికంగా ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కాన్పూర్ నివాసి అయిన లైక్ అహ్మద్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి 20న ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో మరణించారు. అక్కడి వైద్యులు అతని తండ్రి చనిపోయాడని ప్రకటించినప్పుడు, అతని కుమారుడు అతిక్ దానిని నమ్మడానికి నిరాకరించాడు. తండ్రిని ఎంతగానో ఇష్టపడే చిన్న కుమారుడు అతిక్ తండ్రి మరణవార్త విని గుండెలవిసేలా విలపించాడు. మృతదేహాన్ని ఇంటికి అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. అతిక్ బైక్‌పై బయలుదేరాడు. దారిలో అతిక్‌కు గుండెపోటు రావడంతో నడిరోడ్డుపైనే మృతి చెందాడు.

అతన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. అతిక్‌ ని పరిక్షీంచిన వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. తండ్రీకొడుకుల అంత్యక్రియలు కలిసి జరిగాయి. లైక్‌ అహ్మద్‌ ఇద్దరు కుమారులలో అతిక్ చిన్నవాడు. అతని తండ్రితో ఎక్కువ ప్రేమను పంచుకున్నాడు. అతనికి వివాహమైంది. భార్య ఒక కుమార్తె ఉన్నట్టుగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, ఒక అమ్మాయి జుట్టులో చిక్కుకున్న ప్రమాదకరమైన పాము పిల్ల కనిపించింది. పాము పిల్ల ఆ అమ్మాయి జుట్టులో ఎలా చిక్కుకుందో తెలియదు. ఈ వీడియోలో కనిపించే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..సాధారణంగా పాములకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం ఆ పాము పిల్లకు ఏ మాత్రం భయపడటం లేదు. ఆ పాము తనను కాటేస్తుందని ఆ అమ్మాయి అస్సలు భయపడదు. పైగా ఆ అమ్మాయి తన జుట్టు నుండి పామును చాలా హాయిగా బయటకు లాగడం కనిపిస్తుంది. ఈ షాకింగ్ వీడియోను స్నేక్_యూనిటీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 20,000 మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..