అరరే! ఎంత పనైంది.. ఫోటోలకు ఫోజులిస్తూ గుంతలో పడ్డ సామాజిక కార్యకర్త.. వీడియో వైరల్
అలాంటి పబ్లిసిటీ స్టంట్ కోసం పాటుపడిన ఓ సామాజిక కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చింది. ఆయన ఫొటోలకు పోజులిస్తూ గుంతలో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని సియోనిలో ఓ ఆలయం నిర్మిస్తుండగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. అప్పటికే గుంతలు తవ్వి ఉండగా మట్టిని తీసుకువెళ్లి పక్కన వేస్తున్నారు.

చేసేది గోరంతా అయితే, చెప్పుకునేది కొండంతా అన్నట్టుగా ప్రస్తుత రోజుల్లో చాలా మంది పబ్లిసిటీ కోసం పాటు పడుతుంటారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంతో ఎక్కడపడితే అక్కడ ఎగబడి ఫోటోలు, వీడియోలకు ఫోజులిస్తుంటారు. అలాంటి పబ్లిసిటీ స్టంట్ కోసం పాటుపడిన ఓ సామాజిక కార్యకర్త ప్రాణాల మీదకు తెచ్చింది. ఆయన ఫొటోలకు పోజులిస్తూ గుంతలో పడిపోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సియోనిలో చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని సియోనిలో ఓ ఆలయం నిర్మిస్తుండగా కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు. అప్పటికే గుంతలు తవ్వి ఉండగా మట్టిని తీసుకువెళ్లి పక్కన వేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
ఈ క్రమంలోనే ఆలయ నిర్మాణం జరుగుతుండగా, అక్కడికి వెళ్లిన డాక్టర్ ప్రఫుల్ శ్రీవాస్తవ.. కార్మికుడి చేతిలో నుంచి తట్టను తీసుకుని ఫొటోలకు పోజులిస్తూ గుంత చివరకు వెళ్లాడు. అది కాస్తా కూలిపోవడంతో గుంతలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




