AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చేపల కోసం వల వేశాడు.. గాలానికి చిక్కింది ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్.!

Viral Video: కొంతమంది టైం పాస్ కోసం అప్పుడప్పుడూ చేపలు పడుతుంటారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి..

Viral Video: చేపల కోసం వల వేశాడు.. గాలానికి చిక్కింది ఏంటని చూడగా ఫ్యూజులు ఔట్.!
Fishing
Ravi Kiran
|

Updated on: Oct 02, 2021 | 1:51 PM

Share

కొంతమంది టైం పాస్ కోసం అప్పుడప్పుడూ చేపలు పడుతుంటారు. చిన్న కర్రకు ఓ కొక్కెం తగిలించి దానికి ఎరను కట్టి చేపలను పట్టుకోవడానికి గాలంగా ఉపయోగిస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే..! తాజాగా ఓ వ్యక్తి చేపల పట్టేందుకు నీటిలోకి ఎరను కట్టిన కొక్కాన్ని విసిరాడు. ఇక అతడు షాక్‌కు గురయ్యేలా ఊహించని పరిణామం ఎదురైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

నీటిలో పాములు ఉండటం సహజమే. మాములుగా పామును దూరం నుంచి చూస్తేనే భయంతో వణికిపోతాం.. అలాంటిది దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. సోషల్ మీడియాలో సరీసృపాలకు సంబంధించిన వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. మీ ఊహకు అందనటువంటి అలాంటి వీడియో ఇది.

వైరల్ వీడియో ప్రకారం.. చేపల కోసం ఓ వ్యక్తి నీటిలోకి గాలాన్ని వేశాడు. మాములుగా గాలం పడిందంటే.. చేప చిక్కినట్లే అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఓ పాము చిక్కింది. ఇక దాన్ని కాపాడటానికి ఇంకో పాము కూడా బుసలు కొడుతూ నీటి నుంచి బయటికి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి..

Follow Us