Viral: కాటు వేసిన పామును కసకస కొరికాడు.. అది చచ్చింది.. అతను బతికాడు

ఏంది మావ ఇంత వైలెంట్‌గా ఉన్నావ్.. కాటు వేసిన పామును రెండుసార్లు కసకస కొరికేశాడు. దెబ్బకు ఆ పాము చచ్చింది. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను కోలుకున్నాడు. ఇంతకీ ఆ పామును ఎందుకు కొరికాడంటే...

Viral: కాటు వేసిన పామును కసకస కొరికాడు.. అది చచ్చింది.. అతను బతికాడు
Snake Bite
Follow us

|

Updated on: Jul 06, 2024 | 11:59 AM

పాము కాటు పడిందంటే.. ప్రాణం పోతుందేమో అని అందరూ భయపడతారు. దగ్గర్లోని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. కానీ బీహార్‌లో ఓ వ్యక్తి పాము కాటు వేస్తే.. తిరిగి దాన్ని కొరకడం చర్చనీయాంశమైంది. నవాడా జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. కాటు వేసిన పామును.. చేతబట్టి ఏకంగా రెండు సార్లు కొరికాడట ఈ ఘనుడు. ఇతగాడు ఎంత గట్టిగా కొరికాడో ఏందో గానీ ఆ పాము దెబ్బకు చనిపోయింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లడంతో.. సమయానికి చికిత్స అంది అతను మాత్రం విషం నుంచి కోలుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఝార్ఖండ్‌కు చెందిన 35 ఏళ్ల సంతోష్ లోహర్.. రైల్వే కార్మికుడు. బీహార్ నవాడా జిల్లా రాజౌలీ పరిధిలో ఉన్న ఓ దట్టమైన అటవీ ప్రాంతం వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో తోటి కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు. గత మంగళవారం రాత్రి.. డ్యూటీ ముగించుకుని వచ్చి.. నిద్రపోతుండగా.. ఓ పాము అతడికి కాటేసింది. దీంతో వెంటనే అతడు ఆ పాముని పట్టుకుని తిరిగి రెండుసార్లు గట్టిగా కొరికాడు. విషయం తెలిసిన వెంటనే లోహర్‌ను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో.. అతను మర్నాడు ఉదయానికల్లా కోలుకున్నాడు.

అయితే సంతోష్ పామును తిరిగి కొరకడం వెనుక ఓ రీజన్ ఉందట. తమ ప్రాంతంలో కరిచిన పామును.. తిరిగి రెండు సార్లు కొరికితే పాము విషం విరుగుడు అవుతుందని.. ఆ నమ్మకం ప్రకారమే అలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. భారతదేశంలో, పాముకాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది మరణిస్తున్నారు. పాము కాటు వేస్తే నాటు మందులు వాడటం, సొంత వైద్యం చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇలాంటి పనులు మిమ్మల్ని ప్రాణాపాయంలోకి నెడతాయి. సంతోష్ కూడా సమయానికి చికిత్స అందడంతో.. కోలుకున్నాడు తప్పితే.. పామును తిరిగి కొరకడం వల్ల కాదు. అందుకే ఇలాంటి మూఢనమ్మకాలు ఫాలో అవ్వకండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మహారాష్ట్రలో "మేఘా" పవర్.. 9 జిల్లాల రైతులకు ప్రయోజనం
మహారాష్ట్రలో
కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.!
కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం.!
రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్..
రాజేంద్రప్రసాద్‏ను పరామర్శించిన, చిరంజీవి, అల్లు అర్జున్..
తొలి మ్యాచ్‌లోనే పరాజయం.. టీమిండియా సెమీస్ చేరేనా? లెక్కలు ఇవిగో
తొలి మ్యాచ్‌లోనే పరాజయం.. టీమిండియా సెమీస్ చేరేనా? లెక్కలు ఇవిగో
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
ఆకులతో ఆరోగ్యం.. ఈ ఆకులను తీసిపారేయకండి.. ఈ విషయం తెలిస్తే..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
యూట్యూబర్స్ ఫేక్ న్యూస్.. మండిపడ్డ డైరెక్టర్ లోకేష్..
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
ఈటాలీవుడ్ స్టార్ యాంకర్‌ను గుర్తు పట్టారా?అసలెందుకిలా మారిపోయింది
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..
జాతకంలో శని దోషమా..నివారణకు చేయాల్సిన పూజ, దానాలు ఏమిటంటే..