Viral Video: పైకి చూస్తే పుచ్చకాయలు.. కట్ చేసి చూడగా ఖంగుతిన్న పోలీసులు.. వైరల్ వీడియో!

|

Aug 31, 2021 | 7:27 AM

మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు.. అనే సామెత చిన్నతనంలో మీరు వినే ఉంటారు. సరిగ్గా దీనికి సరిపోయేలా..

Viral Video: పైకి చూస్తే పుచ్చకాయలు.. కట్ చేసి చూడగా ఖంగుతిన్న పోలీసులు.. వైరల్ వీడియో!
Watermelons
Follow us on

మేడిపండు చూడు మేలిమై ఉండును.. పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు.. అనే పద్యం చిన్నతనంలో మీరు వినే ఉంటారు. సరిగ్గా దీనికి సరిపోయేలా తాజాగా జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధ్యకాలంలో స్మగ్లర్లు తెలివి మీరిపోయారు. డ్రగ్స్‌ను ఒక చోట నుంచి మరో ప్రాంతానికి రవాణా చేసేందుకు వారు వేసే ప్లాన్స్ అప్పుడప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ వీడియోను చూస్తే అక్రమార్కులు ఇంతలా తెలివి మీరిపోయారా అనిపిస్తుంది. పైకి చూస్తే అదొక పుచ్చకాయల లోడ్ అని భావించిన పోలీసులు.. వాటిని కట్ చేసి చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ డ్రగ్స్ రవాణా అమెరికాలోని పోర్ట్ ల్యాండ్ నగరంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లారీలోని సరుకును చెక్ చేయాలని పోలీసులు భావించారు. వదిలేద్దాం అని అనుకున్నారు. అయితే సరుకు తీసుకెళ్తున్న వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చి ఆ పుచ్చకాయల్లో ఒకటి తీసుకుని కట్ చేశారు. అంతే ఖాకీలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఒక పుచ్చకాయను కోసిన పోలీసులకు అందులో ఓ ప్యాకెట్ దర్శనమిచ్చింది. ఇక దానిని కోయగా.. అందులో నుంచి గంజాయి బయటపడింది. పోలీసులు ఆ లారీ లోడ్ పుచ్చకాయలను ఒక్కొక్కటిగా కోసి చూడగా.. భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేశాయి. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ”డ్రగ్స్ స్మగ్లర్లు మరింతగా తెలివి మీరిపోయారా” అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది.

Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..

RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!

500 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్.. 20 ఓవర్ల మ్యాచ్.. కేవలం 39 బంతుల్లోనే ఫలితం.. తుఫాన్ సృష్టించిన ఓపెనర్ ఎవరంటే?