నిద్రలో పదో అంతస్తు నుంచి కిందపడ్డాడు.. 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు..! ఆ తరువాత జరిగింది చూస్తే..

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికీ ఒళ్లు జలదరించిపోతుంది..భయంతో ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది. గాఢ నిద్రలో ఒక వ్యక్తి అకస్మత్తుగా 10వ అంతస్తు నుండి కిందపడ్డాడు. పదో అంతస్తు అంటే దాదాపు వంద అడుగుల ఎత్తు.. అక్కడి నుండి కిందపడ్డారంటే.. ఇక అంతే సంగతి..! దాదాపుగా బతికే అవకాశం లేన్నట్టే..! కానీ, అతను 8వ అంతస్తులోని కిటికీ గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

నిద్రలో పదో అంతస్తు నుంచి కిందపడ్డాడు.. 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు..! ఆ తరువాత జరిగింది చూస్తే..
Nitinbhai Fell From The Sleeping 10th Floor

Updated on: Jan 03, 2026 | 4:42 PM

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లా నుండి హృదయ విదారక వీడియో ఒకటి వెలువడింది. సూరత్‌లోని రాండర్ జోన్ ప్రాంతంలో ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదం జరిగింది. జహంగీర్‌పురాలోని టైమ్స్‌ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వాసులకు ఒళ్లు జలదరించే దృశ్యంతో వారంతా వణికిపోయారు. గత నెల డిసెంబర్‌ 25న నిద్రలో ఉన్న ఒక వ్యక్తి పక్కకు జరిగిన పాపానికి పదో అంతస్తు నుంచి కింద పడిపోయాడు. కానీ, అతని అదృష్టం బావుంది.. అతడి కాలు 8వ అంతస్తు గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు.

టైమ్స్‌ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వాసి 57 ఏళ్ల నితిన్‌ భాయ్‌ అడియా తన పదో అంతస్తు ఫ్లాట్‌లో కిటికీ పక్కనే పడుకున్నాడు. గాఢ నిద్రలో అతడు, అటు ఇటు దొర్లుతూ, ప్రమాదవశాత్తు కిటికీలోంచి ఒక్కసారిగా బయటకు జారిపోయాడు. అదృష్టవశాత్తు 8వ అంతస్తు కిటీకీ ఊచల్లో తని కాలు బలంగా ఇరుక్కుపోవడంతో గంటపాటు అలాగే గాల్లో వేలాడుతూ ఉండిపోయాడు. అది చూసి అక్కడివారందరూ కంగారు పడిపోయారు. వెంటనే పోలీసులు, ఫైర్‌ సెఫ్టీ సిబ్బందికి సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న వెంటనే జహంగీర్‌పురా, పాలన్‌పూర్, అడాజన్‌ ఫైర్‌ స్టేషన్ల నుంచి సిబ్బంది హుటా హుటినా అక్కడికి చేరుకున్నారు. కింద జనం రక్షణ వలలు పట్టుకోగా, ఫైర్‌ సిబ్బంది పదో అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టులతో కిందకు దిగారు. గాలిలో వేలాడుతున్న నితిన్‌ భాయ్‌ను చాకచక్యంగా పట్టుకున్నారు. అతని కాలిని గ్రిల్‌ నుంచి తప్పించారు. సురక్షితంగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా అతన్ని లోపలికి లాగారు. గంటసేపు ప్రాణాపాయం మధ్య వేలాడుతున్న ఈ వ్యక్తిని రెస్క్యూ ఆపరేషన్ అనంతరం ఎట్టకేలకు అతన్ని ప్రాణాలతో రక్షించింది. దీంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.

అక్కడ ఉన్న ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని రక్షించిన వెంటనే, చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో సమీపంలోని గురుకృపా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా, అగ్నిమాపక శాఖ అత్యవసర చర్య ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.