ఆస్ట్రేలియా-శ్రీలంక (AUS vs SL) మధ్య గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఒక ఫన్నీ సంఘటన జరిగింది. మూడో రోజు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ లెగ్ స్లీప్‌లో నిలబడి ఫీల్డిండ్ చేస్తున్న సమయంలో ఓ స్టంప్ తగిలి క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్తో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు సరదాగా కామెంట్స్ చూస్తూ, వీడియోని తెగ్ వైరల్ చేస్తున్నారు. వార్నర్ దృష్టి పూర్తిగా క్యాచ్ తీసుకోవడంపైనే ఉంది. ఈ క్రమంలో బాల్ తగలడంతో స్టంప్స్ గాల్లోకి ఎగిరాయి. కేవలం బాల్‌పైనే షోకస్ చేసిన వార్నర్.. స్టంప్‌ని గమనించలేదు. గాల్లోకి ఎగిరిన స్టంప్ అతని ప్రైవేట్ పార్ట్‌పై గట్టిగా తగిలింది. దీంతో చిరునవ్వుతో బాధను దాచుకుంటూ వార్నర్ కనిపించాడు. ఈ సమయంలో అతనిని చూసి తోటి ఆటగాళ్లు కూడా నవ్వుతూ కనిపించారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వేసిన బంతి జాఫ్రీ వాండర్సే స్టంప్ బెల్స్‌ను తాకింది. స్టంప్‌ను తాకిన తర్వాత, బంతి లెగ్ స్లిప్‌లో నిలబడిన డేవిడ్ వార్నర్ వైపు వెళ్లి, నేరుగా వార్నర్ ప్రైవేట్ పార్ట్‌కు తాకింది. ఇటువంటి పరిస్థితిలో, వార్నర్ బంతిని పట్టుకోలేకపోయాడు. కానీ, అతను కొంత సమయం పాటు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించాడు. ఈ ఘటన చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా నవ్వుకున్నారు.
Dave Warner copping a bail in the nuts#SLvAUS pic.twitter.com/oRkRRPZ305
— Zeus ?? (@Zeus_Cricket) July 1, 2022
Watch the bail ? #SLvAUS pic.twitter.com/lBK93UnvqY
— Hemant (@hemantbuch) July 1, 2022
గాలే టెస్టులో మూడో రోజునే ఫలితం వెలువడింది. ఇక్కడ ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఆస్ట్రేలియా 321 పరుగులు చేసి 109 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. దీంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా విజయానికి 5 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా వికెట్ నష్టపోకుండా చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది.