Viral Video: చిమ్మచీకటిలో దూరంగా కనిపించిన మెరిసే కళ్లు.. ఏంటా అని పరిశీలించగా.. వామ్మో.!
అసహజ పరిస్థితులను మనం ఫీల్ అయినప్పుడు చాలా భయం ఫీల్ అవుతాం. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి వర్జీనియాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అడవి సమీపాన నివాసముంటుండగా.. చిమ్మచీకట్లో ఏవో మెరిసే కళ్లు కనిపించాయ్. అవేంటంటే.. మీరూ చూసేయండి మరి.

అప్పుడప్పుడూ మనం కొండకోనల్లో ట్రెక్కింగ్‌కి వెళ్లినప్పుడు.. కొన్ని అసహజ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కోవకు చెందిన ఓ సంఘటన.. వర్జీనియాలోని విలియమ్స్‌బర్గ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాబర్ట్ ఎర్ల్‌వైట్ అనే వ్యక్తి విలియమ్స్‌బర్గ్ కొండ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అర్ధరాత్రి సమయంలో తన ఇంటి పెరట్లో విశ్రాంతి తీసుకుంటుండగా.. సమీపంలోని అడవుల్లో అకస్మాత్తుగా ఏవో భారీ శబ్దాలు వినిపించాయి.
ఆసక్తిగా అతడు చిమ్మచీకటిలోని చెట్ల వైపు చూడగా.. ఏవో మెరుస్తూ రెండు కళ్లు కనిపించాయి. చూడటానికి ఆ ఆకారం మనిషిగా కనిపించినా.. అతడి ఉనికి అసహజంగా అనిపించింది. ఆపై ఆ జీవి నాలుగు కాళ్లుపై కదులుతూ చీకటిలో.. సదరు వ్యక్తి వైపు పరుగెత్తినట్టు మీరు వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్.. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తుండగా.. అది స్కిన్‌వాకర్ అని కొందరు.. అడవిలో దాగి ఉన్న మరేదైనా క్రిప్టిడ్ కావచ్చునని చెబుతున్నారు. మరి మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
