Watch Video: రోజూ బర్గర్లు తింటే ప్రపంచ రికార్డు..! గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 70 ఏళ్ల వృద్ధుడు..
అత్యధిక బిగ్ మాక్ బర్గర్‌లను తిన్న మొదటి రికార్డు 1999లో నమోదైంది. అప్పుడు అతను 15 వేల 490 బర్గర్లు తిన్నాడు. అప్పటి నుండి అతను 1999 నుండి తిన్న ప్రతి బిగ్ మాక్ బర్గర్, మెక్‌డొనాల్డ్స్ పార్శిల్ బాక్స్, రశీదును కూడా జతచేశాడు. వీడియోలో దాని ప్రత్యేక సంగ్రహావలోకనం కూడా చూపించాడు. ఒకసారి మీరు కూడా ఈ అద్వితీయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూసేయండి..
ఫాస్ట్ ఫుడ్ కంపెనీ మెక్ డొనాల్డ్స్ తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ఫ్రైస్, బర్గర్లు, ఐస్ క్రీం, అనేక ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. అలాగే ఒక 70ఏళ్ల వృద్ధుడు గత 50ఏళ్లకు పైగా బర్గర్ తింటూ ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు..ప్రస్తుతం బర్గర్ ప్రియుడి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యక్తి 1972 నుండి బర్గర్స్ తినడం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. అమెరికాలోని విస్కాన్సిన్‌కు చెందిన డాన్ గోర్స్కే అత్యధికంగా బిగ్ మాక్ బర్గర్‌లు తింటూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. గత 50 సంవత్సరాలుగా ఈ వృద్ధుడు రోజుకు కనీసం ఒక మెక్‌డొనాల్డ్స్ బిగ్ మాక్ బర్గర్‌ని తింటూ ఉన్నాడు. 2018లో అతను 30,000 బిగ్ మాక్ బర్గర్‌లను, 2021లో 32,000, జనవరి 2023 నాటికి 33,400 బిగ్ మాక్ బర్గర్‌లను తింటూ రికార్డు సృష్టించాడు.
అలాగే, అత్యధిక బిగ్ మాక్ బర్గర్‌లను తిన్న మొదటి రికార్డు 1999లో నమోదైంది. అప్పుడు అతను 15 వేల 490 బర్గర్లు తిన్నాడు. అప్పటి నుండి అతను 1999 నుండి తిన్న ప్రతి బిగ్ మాక్ బర్గర్, మెక్‌డొనాల్డ్స్ పార్శిల్ బాక్స్, రశీదును కూడా జతచేశాడు. వీడియోలో దాని ప్రత్యేక సంగ్రహావలోకనం కూడా చూపించాడు. ఒకసారి మీరు కూడా ఈ అద్వితీయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చూసేయండి..
View this post on Instagram
అతను 1972 లో తన మొదటి బిగ్ మాక్ బర్గర్‌ను తిన్నాడు. అప్పటి నుండి బర్గర్‌లను లెక్కిస్తున్నాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, ఈ వ్యక్తి రికార్డును సొంతం చేసుకోవడానికి అతనికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ వీడియో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ @guinnessworldrecords అధికారిక Instagram ఖాతా నుండి సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు పెద్ద సంఖ్యలో లైకులు, షేర్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి