Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాముతో పసిపిల్లవాడు ఆటలు.. ఏకి పారేస్తున్న నెటిజన్స్

పాము అక్కడ కనిపించినదంటే ఎంతటి ధైర్యవంతులైనా ఇక్కడి నుంచే పరిగెడతారు. అలాంటి ఓ పిల్లాడు బుసలు కొట్టే పాముతో గోలీలాట మాదిరిగా ఆడుకుంటున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా పాములు తల మీద చేయి పెట్టి మరీ నిమురుతూ దాంతో ముచ్చలు చెబుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పాముతో పిల్లాడు ఆడుకుంటున్న వీడియో క్లిప్‌ వివేక్ కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. పాముతో ప్రమాదం

పాముతో పసిపిల్లవాడు ఆటలు.. ఏకి పారేస్తున్న నెటిజన్స్
Toddler Playing Snake
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2025 | 6:21 PM

పాము అక్కడ కనిపించినదంటే ఎంతటి ధైర్యవంతులైనా ఇక్కడి నుంచే పరిగెడతారు. అలాంటి ఓ పిల్లాడు బుసలు కొట్టే పాముతో గోలీలాట మాదిరిగా ఆడుకుంటున్నాడు. ఎలాంటి బెరుకు లేకుండా పాములు తల మీద చేయి పెట్టి మరీ నిమురుతూ దాంతో ముచ్చలు చెబుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

పాముతో పిల్లాడు ఆడుకుంటున్న వీడియో క్లిప్‌ వివేక్ కుమార్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అది వైరల్‌గా మారింది. పాముతో ప్రమాదం అని తెలియని ఆ చిన్న పిల్లాడు దాని తోకను, తలను ఎలా పడితే అలా తాకుతూ ఆడుతూ కనిపించాడు. పామును దాని తలపై పట్టుకుని నిశితంగా పరిశీలిస్తున్నాడు. పిల్లాడు పాముతో ఆడుతూ ప్రమాదవశాత్తూ దాన్ని కుర్చీ సీటుకు కొట్టాడు. దాంతో పాము తన నాలుకను బయటకు తీసి కోపంతో చూసింది. దాంతో పిల్లాడు భయపడి పామును సోఫా నుంచి దూరంగా నెట్టాడు.

అయితే ఈ వీడయో చూసిన నెటిజన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లాలు అలా పాముతో ప్రమాదకరంగా ఆడుతున్నప్పుడు అక్కడ ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారని కామెంట్స్‌ రూపంలో తమ కోపాన్ని వ్యక్త పరుస్తున్నారు. వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తి పసిపిల్లవాడు పామును పట్టుకుంటున్నప్పుడు చిత్రీకరణ కొనసాగిస్తున్నాడు. చివరి క్షణంలో మాత్రమే రికార్డ్‌ ఆపివేసాడు. పిల్లాడికి ఏమైనా జరిగితే పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీసి ఉండేదని నెటిజన్స్‌ రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

వీడియో చూడండి: