Viral Video: నీటిపై నడుస్తున్న గుర్రం.. షాకింగ్‌ వీడియో వైరల్‌.. అదేలా సాధ్యమంటూ అంతా షాక్‌..

|

Sep 12, 2022 | 2:29 PM

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో క్యూరియాసిటీ ఆఫ్ సైన్స్ అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ 11 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్లు అంటే 45 లక్షల మంది చూశారు.

Viral Video: నీటిపై నడుస్తున్న గుర్రం.. షాకింగ్‌ వీడియో వైరల్‌.. అదేలా సాధ్యమంటూ అంతా షాక్‌..
Moose Running
Follow us on

Viral Video: అడవులు అంతరించిపోతున్నాయి. దాంతో అక్కడి జంతువులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. అలా దారితప్పి మానవ నివాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు పలు సందర్బాల్లో ప్రమాదాల బారిన పడుతుంటాయి. మరికొన్నింటిని వేటగాళ్లు, స్థానికులు కొట్టి గాయపరచటం, చంపంటం చేస్తున్నారు. అయితే, అడవి జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ ఓ జింకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. నీటి మీద నడవడం మనుషులకు గానీ, జంతువులకు గానీ సాధ్యం కాదని తెలుసు..ఎవరైనా ఇలా చేస్తే వారిలో ఏదో సూపర్ పవర్ ఉన్నట్లేనని నమ్ముతారు. అయితే, కొందరు మనుషులు నీటిపై హాయిగా నడవడాన్ని మీరు అనేక సైన్స్ ఫిక్షన్, పౌరాణిక చిత్రాలలో చూస్తుంటాం. కానీ, జింకలు నీటిపై దూకడం ఎప్పుడైనా చూశారా? నీటిపై తేలుతూ దూకుతున్న జింకలకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్లందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది.

వాస్తవానికి, వీడియోలో జింక జాతికి చెందిన ఒక దుప్పి నీటిపై నడవకుండా పరుగెత్తుతోంది. దూరం నుండి గుర్రంలా కనిపించే దుప్పి నీటిపై ఎలా దూసుకుపోతుందో వీడియోలో మీరు చూడవచ్చు. దాని పాదాలు నీళ్లలో మునగకుండా నడుస్తుంది..దాని పక్కనే ఒక పడవ ప్రయాణిస్తుంది. దాన్ని అక్కడ నీటి ప్రవాహం లోతు ఎక్కువగానే ఉందని అర్థం అవుతుంది. అయినప్పటికీ, జింక నీటిలో మునిగిపోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత, ఇది నిజంగా జరిగిందా లేదంటే వీడియో ఎడిట్ చేయబడిందా అన్న సందేహం మీకు ఖచ్చితంగా రాక మానదు. కాకపోతే, ఈ వీడియో క్లిప్‌ ఎడిటింగ్‌లా మాత్రం అనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో క్యూరియాసిటీ ఆఫ్ సైన్స్ అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ 11 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 4.5 మిలియన్లు అంటే 45 లక్షల సార్లు వీక్షించారు, అయితే లక్ష మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి