Viral Video: ఏషాలేస్తే ఇట్లనే ఉంటది.. షార్క్‌ను పట్టుకోబోయాడు.. సుస్సుపోసుకున్నాడు.!
జంతువులు, జలచరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చనువు ఇచ్చాయి కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే..

జంతువులు, జలచరాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చనువు ఇచ్చాయి కదా అని ఓవర్ యాక్షన్ చేస్తే మన ప్రాణాలు ప్రమాదంలో పడినట్లే. దీనికి అడ్డం పట్టే విధంగా ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. సముద్రంలోని ఓ పడవలో ఒక ఫ్యామిలీ తమ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అంతలో అనుకోని అతిధిలా ఆ ఫ్యామిలీని చిన్న సొరచేప(షార్క్) వచ్చి పలకరిస్తుంది. చిన్నదైనా.. పెద్దదైనా.. షార్క్ ప్రమాదకరమైన జలచరం.. దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ షార్క్‌తో ఓవర్ యాక్షన్ చేశాడు పడవలోని వ్యక్తి. అంతే! సొరచేపకు తిక్కరేగిపోయింది. ఒక్కసారిగా అతడి చేతిని నోటితో గాయపరిచింది. ఈ క్రమంలోనే సొరచేప పళ్లకు రక్తం ఉండటం.. అతడి వేలికి గాయం కావడం మీరు వీడియోలో చూడవచ్చు.
we would’ve had shark steaks the same night ? pic.twitter.com/GDKZCCUgTC
— SourPatchB? (@ButtahCuupB) July 20, 2022
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.
