Interesting Fact: ఈ ఎడబాటు.. మనుషుల్లోనే కాదు పక్షులలో కూడానూ.. ఇది మీకు తెల్సా.!

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మనుషుల మనుగడకే కాదు, ఇతర జీవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్‌తో పర్యావరణ విధ్వంసం ప్రధాన కారణం. కానీ దీని కారణంగా మనుషులుతో పాటు పక్షి జాతులు కూడా..

Interesting Fact: ఈ ఎడబాటు.. మనుషుల్లోనే కాదు పక్షులలో కూడానూ.. ఇది మీకు తెల్సా.!
Birds

Edited By: Ravi Kiran

Updated on: Feb 29, 2024 | 6:00 PM

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మనుషుల మనుగడకే కాదు, ఇతర జీవాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్‌తో పర్యావరణ విధ్వంసం ప్రధాన కారణం. కానీ దీని కారణంగా మనుషులుతో పాటు పక్షి జాతులు కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పక్షి జాతులు అంతరించిపోవడంతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపడింది.

సాధారణంగా మనుషులు కొన్ని కారణాలతో విడిపోతుంటారు. అయితే తాజా రిపోర్ట్ ఇలాంటి ఎడబాటు పక్షులలోనూ ఉందని అంటోంది. సర్వే ప్రకారం ఆహారం, సంతానోత్పత్తితో పాటు కొన్ని వాతావరణ మార్పుల కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం వల్ల పక్షులు విడిపోతున్నాయని అంటున్నారు. జర్మనీకి చెందిన ఒక పరిశోధనా సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం పక్షి జాతులు కలిసి మెలిసి సమూహంగా జీవిస్తుంటాయి. అయితే పర్యావరణ ప్రభావం, ఆహారం దొరక్కపోవడం కారణంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి.

ఒక చోటు నుంచి మరో చోటికి పక్షులు వలస వెళ్ళడం వల్ల తమ పార్టనర్ నుంచి దూరం కావడం తప్పడం లేదని.. అక్కడ ఇతర కారణాలతో ఇంకో పార్టనర్‌తో జత కట్టడం జరుగుతుంది. ఈ లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్ కారణంగా పక్షులు తమ మొదటి పార్ట్నర్‌తో కలిసిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎడబాటు బాధను ఫీలవుతాయని నిపుణులు జరిపిన సర్వేలో తేలింది. ఈ స్టడీ కోసం 233 పక్షి జాతుల వలసలు, మీటింగ్ బిహేవియర్ డేటాను వారు సమీక్షించి ఎనలైజ్ చేసి రిపోర్ట్ రెడీ చేశామని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: మండుటెండల్లో సిమ్లాలాంటి చల్లదనం.. కూలర్ కంటే చౌకైన ధర.. ఈఎంఐ ఆప్షన్ కూడా