
ప్రస్తుతం రోజుల్లో సోషల్ మీడియలో అనేది మానవుల జీవితంలో ఒక భాగం అయిపోయింది. సోషల్ మీడియాను చూడండే మన రోజు గడవదు. అందులో వచ్చే చిత్రవిచిత్రమైన వీడియోలు ప్రజలను అంతలా ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోల్లో జంతువులకు సంబంధించినవి కూడా చాలా వరకే ఉంటాయి. ఆ వీడియోల్లో అవి చేసే చిలిపి పనులు చూపరులకు నవ్వులు తెప్పించడంతో పాటు.. ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంటాయి. తాగాజా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో ఒకటి వెలుగు చూసింది. నరంలో సంచరిస్తున్న ఓ కోతికి రోడ్డుపై ఓ అద్దం దొరికింది. ఇంకేముంది. దాన్ని తీసుకొని వెళ్లి ఓ గోడపై కూర్చొని దాంట్లో తన ప్రతిబింబాన్ని పదేపదే చూసుకుంటూ తెగమురిసిపోయింది.
మనుషులకే కాదు మూగజీవులకు కూడా అద్దంలో ప్రతిబింబాన్ని పదేపదే చూసుకోవాలనే తాపత్రయం ఎలా ఉంటుందో అనేది ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. అద్దంలో కోతి తన ప్రతిబింబాన్ని చూస్తూ షాక్ కు గురవుతూ, మరొకసారి ఇంకో కోతి తన ఎదురుగానే ఉందనుకొని కంగారు పడటం కనిపించింది. సుమారు గంట పాటు అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోయిన ఆ కోతి కొద్దిసేపటికి అద్దాన్ని వదిలేసి వెళ్లిపోయింది.
ఈ ఆశ్యర్యకర ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో వెలుగు చూసింది. ఆ వానరం పగిలిన అద్దంలో తనను తాను చూసుకుంటూ మురిసిపో తున్న సన్నివేశాన్ని చూసిన జనాలు అవాక్కయ్యారు. ఆ వానరం చేస్తున్న చిలిపి చేష్టలను తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమ రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..