పాము..ఈ పేరు వింటే ఎందుకో తెలీదు భయం పుట్టుకొస్తుంది. పామును దగ్గరికెళ్లి చూస్తే ఇంకా ఏమైనా ఉందా గుండె జారినంత పని అవుతుంది. పాము అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా భయమే..చివరికి పెద్ద పులి సైతం పామును చూస్తే దడుచుకుంటుంది. అయితే ఇలాంటి పాములు కూడా కొన్ని చిన్న జీవులతో పోటి పడలేవు. పాము పవర్‌ఫుల్ అయిన కొన్ని చిన్న చిన్న ప్రాణులకు భయపడి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒక్కటి జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ తేలు పామును భయపడేలా చేసింది.
ఓ పాము ఒక్క రాళ్ల గూడులోకి వెళ్తుంది. తనకు తినడానికి ఏమైన ఆహారం దొరుకుతుందని ఆశతో ఆ రాళ్ల గూడులోకి వెళ్తుంది. అనుకోకుండా అందులో రెండు తేళ్లు ఉంటాయి. వాటిని చూసిన పాము భయంతో పక్కకు జరుగుతుంది. బిక్కుబిక్కుమంటూ ఓ సైడ్‌కు ఉంటుంది. ఆ రెండు తేళ్లలో ఓ తేలు పాము ఎదురుగా ఉంటే మరోకటి గోడపైన ఉంటుంది. దీంతో బుసలు కొడుతూ పాము వీటితో నాకెందుకులే అన్నట్లుగా భయపడుతూ ఉంటుంది. అయితే తేలు తగ్గేదేలే అన్నట్టుగా పాము ఎదురుగా నిలబడుతుంది. ఆ తేలు దగ్గరికి వస్తున్నప్పుడలా పాము బుసలు కొడుతుంది.
ఈ దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. ఈ స్పష్టి నుంచి మనం కొన్ని విషయాలను నెర్చుకోవచ్చను అని.. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకుడదు అని ఈ వీడియో ద్వారా అర్థమవుతుందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరెమె పెద్ద పామును రెండు చిన్న తేళ్లు చెమటలు పట్టించాయంటూ కామెంట్లు పెడుతున్నారు.