Skirts for Boys: ఇకపై అబ్బాయిలూ స్కర్ట్స్ ధరించొచ్చు.. ఆర్డర్స్ ఇష్యూ చేసిన మేయర్.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!

|

Nov 08, 2021 | 10:12 AM

Skirts for Boys: ప్రపంచం లో ఏ దేశంలో అయినా అమ్మాయిలకు ఒక డ్రస్ కోడ్, అబ్బాయిలకు ఒక డ్రస్ కోడ్ అనేది ఉంటుంది. అది స్కూల్ అయినా, కాలేజీ అయినా మరేదైనా కానీ.

Skirts for Boys: ఇకపై అబ్బాయిలూ స్కర్ట్స్ ధరించొచ్చు.. ఆర్డర్స్ ఇష్యూ చేసిన మేయర్.. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు..!
Boys Skirts
Follow us on

Skirts for Boys: ప్రపంచం లో ఏ దేశంలో అయినా అమ్మాయిలకు ఒక డ్రస్ కోడ్, అబ్బాయిలకు ఒక డ్రస్ కోడ్ అనేది ఉంటుంది. అది స్కూల్ అయినా, కాలేజీ అయినా మరేదైనా కానీ. ఓ ప్రాంతంలో మాత్రం అబ్బాయిలందరూ, అమ్మాయిలు వేసుకొనే స్కర్టులు వేసుకొని స్కూల్ కి వచ్చారు. అంతటితో ఆగకుండా, ఇలా అందరూ స్కర్టులు వేసుకొని గ్రూపు ఫోటోలకు ఫోజిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

అయితే, దీని వెనుక ఓ కారణం ఉందని తెలిసింది..గత ఏడాది స్పెయిన్ లో ఓ విద్యార్థి స్కర్టు వేసుకొని స్కూల్ కి వచ్చాడు. దాంతో పాఠశాల యాజమాన్యం ఆ విద్యార్థిని అవమానించి.. తరగతి గది నుంచి బయటకు పంపేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై కధనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థికి అండగా ఉండేందుకు స్కర్ట్ ఉద్యమమే మొదలైందట..అందులో భాగంగానే తాజాగా, మెక్సికో నగరంలో ఉన్న స్కూళ్లకు ఇకపై అబ్బాయిలు కూడా స్కర్ట్‌లు వేసుకుని వెళ్లచ్చని ప్రకటించారు మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షేన్‌ బామ్‌.

అదే విధంగా అమ్మాయిలు సైతం ట్రౌజర్లు వేసుకుని స్కూలుకు రావచ్చు. లింగవివక్షను తీసివేయడానికే ఈ పద్దతిని అమలు చేస్తున్నామని చెప్పారు…ఆమె తీసుకొచ్చిన ఈ సంస్కరణకు ట్రాన్స్‌జెండర్ సంఘాలు మద్దతు పలికాయి. విద్యాశాఖ మంత్రి ఎస్టెబన్ సైతం మేయర్ తీసుకొచ్చిన సంస్కరణను అభినందించారు.ఇతర రాష్ట్రాలు సైతం ఈ పద్దతిని అమలుచేస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజంగా అబ్బాయిలు కూడా స్కర్ట్స్ వేసుకొని స్కూల్స్ కు వెళితే ఎవరు అమ్మాయి, ఎవరు అబ్బాయి అని పోల్చుకోవడం కష్టమే అయిపోతుంది. ఇక ఈ పద్దతిని ఇంకా ఎన్ని దేశాలు ఫాలో అవుతాయో చూడాలి మరీ..!

Also read:

KCR vs BJP: సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్ రావు.. ఏమన్నారంటే..

T20 World Cup 2021: అక్తర్‌పై రూ.10 కోట్ల నష్ట పరిహారం కేసు.. దిగ్గజ బౌలర్ కు నోటీసులు పంపిన పాక్‌ ఛానెల్‌..

New Car – Heart Attack: పొంచి ఉన్న ఉపద్రవాన్ని ముందే పసిగడుతుంది.. ఈ కారు స్పెషాలిటీయే వేరే..!