యుద్ధట్యాంకుల మధ్య వెల్లివిరిసిన ప్రేమ

లవ్‌ను ప్రపోజ్‌ చేయడం ఓ ఆర్ట్‌...! ఉత్తినే ఐ లవ్‌ యూ అంటే పడిపోరెవ్వరూ! అందుకే డెనిస్‌ కజంత్సవ్ తను ప్రేమించిన అమ్మాయి అలెగ్జాండ్రా కొపిటోవాను సర్‌ప్రైజ్‌గా ప్రపోజ్‌ చేసి సక్సెసయ్యాడు.. ఆర్మీలో ప్లటూన్ కమాండర్‌ అయిన డెనిస్‌ ఓ 16 యుద్ధ ట్యాంకులను తెచ్చి వాటిని హార్ట్‌ షేప్‌లో నిలబెట్టాడు.

యుద్ధట్యాంకుల మధ్య వెల్లివిరిసిన ప్రేమ
Follow us
Anil kumar poka

|

Updated on: Feb 19, 2020 | 12:58 PM

లవ్‌ను ప్రపోజ్‌ చేయడం ఓ ఆర్ట్‌…! ఉత్తినే ఐ లవ్‌ యూ అంటే పడిపోరెవ్వరూ! అందుకే డెనిస్‌ కజంత్సవ్ తను ప్రేమించిన అమ్మాయి అలెగ్జాండ్రా కొపిటోవాను సర్‌ప్రైజ్‌గా ప్రపోజ్‌ చేసి సక్సెసయ్యాడు.. ఆర్మీలో ప్లటూన్ కమాండర్‌ అయిన డెనిస్‌ ఓ 16 యుద్ధ ట్యాంకులను తెచ్చి వాటిని హార్ట్‌ షేప్‌లో నిలబెట్టాడు.. అలెగ్జాండ్రా కొపిటోవా కళ్లు మూసి ఆ యుద్ధ ట్యాంకుల మధ్యలోకి తీసుకొచ్చాడు. మోకాళ్ల మీద కూర్చుని ఆర్మీ స్టయిల్లోనే ఐ లవ్‌ యూ చెప్పాడు.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని రిక్వెస్ట్‌ చేశాడు.. ఇతగాడి ప్రపోజ్‌కు ఎవరు మాత్రం పడిపోరు..! అలెగ్జాండ్రా కూడా ఫిదా అయ్యింది.. వెంటనే లవ్‌లో పడిపోయింది… అన్నట్టు ఇదెక్కడ జరిగిందో చెప్పలేదు కదూ! రష్యా రాజధాని మాస్కోలో…