Kambala race: కంబళ పోటీల్లో మరో ఉస్సేన్‌బోల్ట్.. నిషాంత్‌శెట్టి సరికొత్త రికార్డ్!
Kambala race: కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే.. ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును […]
Kambala race: కర్ణాటకలో కంబాళ జాకీ అయిన శ్రీనివాస గౌడ ఇప్పుడు ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయారు. అయితే.. ఈ పోటీల్లో మరో రికార్డు నమోదయింది. బజగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ శెట్టి అనే వ్యక్తి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి విజయం సాధించాడు. వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్టే. దీంతో గతంలో శ్రీనివాస గౌడ నమోదు చేసిన రికార్డును నిషాంత్ శెట్టి బద్దలు కొట్టాడు. కొద్ది రోజుల క్రితం కంబళ పోటీలో శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకున్నాడు. అంటే వేగం పరంగా 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తాడు. ఇది జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ రికార్డు కంటే 0.03 సెకన్లు తక్కువ. తాజాగా ఈ రెండు రికార్డులను నిషాంత్ అధిగమించాడు.
దక్షిణ కర్ణాటకలో ప్రతి ఏడాది కంబళ అనే సాంప్రదాయ పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తూ…వాటి వెనుక యజమాని కూడా పరుగెడతాడు. అయితే గతంలో శ్రీనివాస గౌడను ఉసేన్ బోల్ట్‌తో పోలుస్తూ సామాజిక మాథ్యమాల వేదిక అభినందనలు వెల్లువెత్తాయి. ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖలు కూడా అతడికి బంగారు పతకం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. దీంతో క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు అతడికి ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా సాయ్ కోచ్‌లను ఆదేశించారు. అయితే తాను ఇప్పుడే సాయ్ ట్రయల్స్‌కు హాజరుకాలేనని, దానికి కొంత సమయం కావాలని కోరనున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శ్రీనివాస గౌడను తన కార్యలయానికి పిలిపించి అతణ్ని శాలువాతో సత్కరించి రూ.3 లక్షల నగదు బహుమతి అందించారు.
అయితే.. వాస్తవానికి ట్రాక్‌పై పరుగెత్తడంతో పోలిస్తే.. కంబాళ పోటీలో పరుగెత్తడం కాస్త సులువనే అభిప్రాయాలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. బురద నీళ్లలో కంబాళ పోటీలు జరిగినప్పటికీ.. జాకీకి దున్నల నుంచి వేగం విషయంలో సపోర్ట్ లభిస్తుంది. కాబట్టి.. ఆ వేగం జాకీలదిగా లెక్కించడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. దీంతో.. అసలు కంబాళ పోటీలో వేగం లెక్కింపు కోసం వాడుతున్న సాంకేతిక యంత్రాలపై అనుమానాలు నెలకొన్నాయి.
[svt-event date=”18/02/2020,4:12PM” class=”svt-cd-green” ]
Here am introducing #Kambala‘s fastest runner Mr. #NishanthShetty ! ??
Yes u heard right! This is not #SrinivasaGowda‘ s video, this is #Nishanth‘s ! ?
I wish @KirenRijiju sir, and @anandmahindra sir Should have seen it ! pic.twitter.com/Wuv58mRkN2
— Shruthi Thumbri ?? (@Shruthi_Thumbri) February 18, 2020
[/svt-event]