Viral Video: ఆశగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. ఇంటికి వచ్చింది చూసి షాక్..!

ఈ మధ్యకాలంలో అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌ పేరుతో కూడా ప్రజలు నిలువునా మోసపోతున్నారు. ఆన్‌లైన్‌లో కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. అవి ఇంటికి డెలివరీ కాకపోవడం.. లేదా వాటి స్థానంలో మరొకటి పార్శిల్‌లో ఉండటం లాంటి ఘటనలు మనం తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సరిగ్గా షాకింగ్ సీన్‌ ఒకటి ఖమ్మం వ్యక్తికి ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: ఆశగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. ఇంటికి వచ్చింది చూసి షాక్..!
Online

Updated on: Jun 03, 2025 | 11:29 AM

అడుగడునా ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను అడ్డాగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ఆన్‌లైన్ షాపింగ్‌ పేరుతో కూడా ప్రజలు నిలువునా మోసపోతున్నారు. ఆన్‌లైన్‌లో కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు.. అవి ఇంటికి డెలివరీ కాకపోవడం.. లేదా వాటి స్థానంలో మరొకటి పార్శిల్‌లో ఉండటం లాంటి ఘటనలు మనం తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సరిగ్గా షాకింగ్ సీన్‌ ఒకటి ఖమ్మం వ్యక్తికి ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియో ఇక్కడ చూడండి..

ఖమ్మం జిల్లా బోదులబండకు చెందిన కాకాని సీతారాంచౌదరి ఇటీవల మింత్రా ఆన్‌లైన్‌ యాప్‌లో మోచీ మెన్‌ లెదర్‌ కంఫర్ట్‌ శాండిల్స్‌ బుక్‌ చేశారు. ఆర్డర్‌ సమయంలోనే రూ.3,990ను యాప్‌లో ముందస్తు చెల్లింపు చేశారు. సోమవారం వచ్చిన పార్సిల్ తెరిచి చూడగా అందులో మురికి చెప్పు ఒకటి దర్శనమివ్వడంతో కంగుతిన్నారు. ఖరీదైన మోచీ బ్రాండ్‌ చెప్పులను బుక్‌ చేస్తే వినియోగించిన చెప్పుల జత డెలివరీ కావటంతో అతడు ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..