AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెరుపు వేగంతో పరిగెత్తి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్… వాచ్ వీడియో

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ స్లిప్ అయిన పడిపోయిన వ్యక్తి ప్రాణాలను కానిస్టేబుల్ కాపాడాడు. ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...

Viral Video: మెరుపు వేగంతో పరిగెత్తి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్... వాచ్ వీడియో
Rpf Saves Life
Ram Naramaneni
|

Updated on: Sep 12, 2021 | 7:18 PM

Share

నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) కానిస్టేబుల్ త్వరితగతిన స్పందించడంతో ఓ నిండు ప్రాణం మిగిలింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ స్లిప్ అయిన పడిపోయిన వ్యక్తి ప్రాణాలను కానిస్టేబుల్ కాపాడాడు. ఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని ప్రయాణీకుడు శుక్రవారం రాత్రి 9 గంటలకు రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నంబర్ 3 వద్ద కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించాడు. ఆ ప్యాసింజర్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్‌ఫారమ్ గ్యాప్‌లోకి జారిపోయాడు. ఆ ప్రయాణికుడ్ని గమనించిన కానిస్టేబుల్ మునేష్ గౌతమ్ మెరుపు వేగంతో పరిగెత్తి ప్యాసింజర్‌ని ప్లాట్‌ఫారమ్ గ్యాప్ నుండి క్షణాల్లో లాగి అతడిని సేవ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ అశుతోష్ పాండే సోషల్ మీడియాలో షేర్ చేశారు. సమయస్ఫూర్తితో స్పందించినందుకు కానిస్టేబుల్ మునేష్ గౌతమ్‌ని ఆయన అభినందించారు. కాగా నెటిజన్లు కూడా కానిస్టేబుల్‌ ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రియల్ హీరో అని పొగుడుతున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కూడా ఇలాంటి ఘటనే..

ఈ ఏడాది జూలై నెలలో కూడా  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్న మహిళను ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాపాడారు. నసీమా బేగం అనే మహిళ ప్లాట్‌ఫామ్‌.. రైలు మధ్యలో ఇరుక్కు పోయింది. అటుగా వస్తున్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దినేశ్‌సింగ్‌ వెంటనే అలెర్టై ఆమెను వేగంగా బయటకు లాగారు. ఇంతలో.. ట్రైన్లో ప్రయాణిస్తున్న వ్యక్తి చైన్‌ లాగడంతో పది నిమిషాల పాటు రైలును ఆపేశారు. నసీమా బేగంను సేవ్ చేసిన రైల్వే కానిస్టేబుల్‌ దినేశ్‌సింగ్‌ను ప్రయాణికులు, అధికారులు అభినందించారు.

Rpf

Also Read: Viral Video: 2 గంటలు చిన్నారి మెడను చుట్టిన నాగుపాము… కానీ చివరకు మాత్రం

Viral Video: నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి దూరిన పాము.. ఆ తర్వాత ఊహించని సీన్

బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!