Watch: బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా ఊడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు.. షాకింగ్‌ వీడియో వైరల్

ఓ వంతెనను దాటే క్రమంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ప్రమాద సమయంలో బస్సు రెండో అంతస్తులో నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Watch: బ్రిడ్జి కింది నుంచి వెళ్తుండగా ఊడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు.. షాకింగ్‌ వీడియో వైరల్
Double Decker Bus

Updated on: Jul 22, 2025 | 8:45 PM

యూకేలోని మాంచెస్టర్‌లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఓ వంతెనను దాటే క్రమంలో డబుల్‌ డెక్కర్‌ బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. సోమవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో యూకేలోని ఎక్లెస్‌లోని బార్టన్‌ లేన్‌లోని బ్రిడ్జ్‌వాటర్‌ కెనాల్‌ అక్విడక్టన్‌ను డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మాంచెస్టర్‌ పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం వెంటనే రంగంలోకి దిగింది. నార్త్‌ వెస్ట్‌ అంబులెన్స్‌ సర్వీస్‌10 అత్యవసర అంబులెన్స్‌లను మోహరించింది. 15 మంది రోగులకు సంఘటన స్థలంలోనే చికిత్స అందించింది. అనంతరం సాల్పోర్డ్‌ రాయల్‌ మాంచెస్టర్‌ రాయల్‌ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సు రెండో అంతస్తులో నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..