దోపిడికి గురై ఏడ్చేసిన డెలివరీ బాయ్.. వస్తువులను తిరిగిచ్చేసిన దొంగలు

తెలిసో తెలియకో చాలా మంది రోడ్ల మీద దోపిడీకి గురవుతుంటారు. అలా ఓ డెలివరీ బాయ్‌ రోడ్డుపైనే చోరికి గురయ్యారు. డెలివరీ ఇచ్చి వెళ్లే సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు..

దోపిడికి గురై ఏడ్చేసిన డెలివరీ బాయ్.. వస్తువులను తిరిగిచ్చేసిన దొంగలు
TV9 Telugu Digital Desk

| Edited By:

Jun 18, 2020 | 10:38 PM

తెలిసో తెలియకో చాలా మంది రోడ్ల మీద దోపిడీకి గురవుతుంటారు. అలా ఓ డెలివరీ బాయ్‌ రోడ్డుపైనే చోరికి గురయ్యారు. డెలివరీ ఇచ్చి వెళ్లే సమయంలో అటుగా వచ్చిన ఓ ఇద్దరు దుండగులు.. బెదిరించి, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను లాక్కున్నారు. దీంతో వెంటనే ఆ డెలివరీ బాయ్ ఏడ్చేశాడు. అయితే అతడి ఏడుపుతో మనసు మార్చుకున్న ఆ ఇద్దరు దొంగలు అతడి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. అంతేకాదు అందులో ఒకరు బైక్‌పైనే ఉండగా.. కిందికి దిగిన మరో వ్యక్తి డెలివరీ బాయ్‌ని హత్తుకొని ఓదార్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఆ ముగ్గురు వెళ్లిపోయారు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వగా..ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read This Story Also: పని ముఖ్యమే.. ప్రాణం అంతకన్నా ముఖ్యం: సినీ కార్మికులకు మెగాస్టార్ భరోసా

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu