Watch Video: సమ్మర్‌ కదా అని కూల్‌డ్రింక్స్‌ ఎక్కువ తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే.. వణుకు పుట్టాల్సిందే..

|

Mar 15, 2024 | 11:02 AM

ప్లాస్టిక్ బాటిల్స్‌ ద్వారా విక్రయించే కూల్‌డ్రింక్స్‌ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చాలా నివేదికలు వెల్లడించాయి. దాంతో ఇప్పుడు ప్రజలు ప్లాస్టిక్‌కు బదులుగా అల్యూమినియం క్యాన్‌లలోని కూల్‌డ్రింక్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, అల్యూమినియం క్యాన్‌ల భద్రత గురించి తెలియదు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అల్యూమినియం క్యాన్‌లలో దాగి ఉన్న రహస్యాన్ని వీడియో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడించింది.

Watch Video: సమ్మర్‌ కదా అని కూల్‌డ్రింక్స్‌ ఎక్కువ తాగేస్తున్నారా..? ఈ విషయం తెలిస్తే.. వణుకు పుట్టాల్సిందే..
Soft Drink Cans
Follow us on

అసలే సమ్మర్‌.. పెరుగుతున్న వేడి కారణంగా కూల్‌డ్రింక్స్‌ అమ్మకాలు, కూల్‌డ్రింక్స్‌ తాగే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కెమికల్స్‌ ఆధారిత కూల్‌డ్రింక్స్‌ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, మనలో చాలా మంది దానిని నిర్లక్ష్యం చేస్తారు. పెద్దలు, వైద్యులు, నిపుణులు ఎప్పటికప్పుడు వద్దని చెబుతున్నప్పటికీ, చాలా మంది శీతల పానీయాలు తాగడం మానేయరు. ప్లాస్టిక్ బాటిల్స్‌ ద్వారా విక్రయించే కూల్‌డ్రింక్స్‌ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని చాలా నివేదికలు వెల్లడించాయి. దాంతో ఇప్పుడు ప్రజలు ప్లాస్టిక్‌కు బదులుగా అల్యూమినియం క్యాన్‌లలోని కూల్‌డ్రింక్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, అల్యూమినియం క్యాన్‌ల భద్రత గురించి తెలియదు. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అల్యూమినియం క్యాన్‌లలో దాగి ఉన్న రహస్యాన్ని వీడియో పోస్ట్ చేయడం ద్వారా వెల్లడించింది.

శీతల పానీయాల కోసం ఉపయోగించే స్టీల్, అల్యూమినియం డబ్బాల్లో దాచిన ప్లాస్టిక్ ర్యాప్‌ను స్పష్టంగా చూపించే వీడియోను యోగా, పోషకాహార నిపుణుడు ఆదిత్య నటరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్‌గా మారిన ఈ వీడియో అందరినీ కలిచివేసింది. ఈ విధానం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కానీ, అల్యూమినియం క్యాన్‌లో కూల్‌డ్రింక్స్‌ తాగేవారికి తెలియదు. వీడియోలో, ఆదిత్య నటరాజ్ కోక్ క్యాన్, స్యాండ్‌పేపర్‌ తీసుకున్నాడు.. స్యాండ్‌పేపర్‌ సాయంతో కోక్‌ క్యాన్‌ బయటి పెయింట్‌ను రబ్‌చేసి తొలగించాడు. ఇప్పుడు క్యాన్‌లోని కూల్‌డ్రింక్‌ గాజు గ్లాస్‌లో పోశాడు. ఇప్పుడు అల్యూమినియం డబ్బాను ఆ కూల్‌డ్రింక్‌లో ముంచాడు..దాంతో ఆ అల్యూమినియం డబ్బాపై పూత పూర్తిగా కరిగిపోతుంది. కొంత సమయం తర్వాత బయటకు తీసి చూడగా, ఆ డబ్బా పూర్తి పారదర్శకమైన ప్లాస్టిక్ కవర్‌గా మారటం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆదిత్య నటరాజ్ దీని వెనుక శాస్త్రీయ హేతువును కూడా ఇచ్చారు. అతను ఇలా వ్రాశాడు, “శీతల పానీయాల డబ్బాలు అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడ్డాయి. డ్రెయిన్ క్లీనర్ NaOH (సోడియం హైడ్రాక్సైడ్) మిశ్రమం. ఈ రెండూ ఒకదానికొకటి రసాయనికంగా ప్రతిస్పందిస్తాయి. ఇది తీవ్రమైన వేడిని ఉత్పత్తి చేస్తుంది. డ్రెయిన్ క్లీనర్ (NaOH) అల్యూమినియంతో మాత్రమే చర్య జరిపి దానిని కరిగిస్తుంది. ఇది ప్లాస్టిక్ పొరను ప్రాసెస్ చేయదు. అందుకే NaOH సాధారణంగా ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ చేయబడుతుంది.

ముఖ్యంగా, అల్యూమినియంతో ఆమ్ల పానీయాలు కలపకుండా నిరోధించడానికి, రసాయన ప్రతిచర్యలను నివారించడానికి డబ్బా లోపలి భాగంలో ప్లాస్టిక్ పొరను ఉపయోగిస్తారు. శీతల పానీయాల పరిశ్రమలోని శాస్త్రవేత్తలు, టెక్నీషియన్స్‌ సిబ్బందికి ఇది తెలుసు. కానీ ఇప్పుడు సాధారణ ప్రజలకు దాని గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..