పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది…రెస్టారెంట్‌కు రూ.20,000 ఫైన్ పడింది

|

Jul 18, 2022 | 5:02 PM

డెలివరీ ఎగ్జిక్యూటీవ్ కాసేపట్లో ఫుడ్ పార్శిల్ తీసుకువచ్చి ఇచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మటర్ పన్నీర్ కర్రీ లేదు. బదులుగా చికెన్ కర్రీ కనిపించడంతో ఖంగుతిన్నారు. ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీకి..

పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో చికెన్ కర్రీ వచ్చింది...రెస్టారెంట్‌కు రూ.20,000 ఫైన్ పడింది
Restaurant Deliver
Follow us on

ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే కాలం ఇది. అందుకుగానూ అనేక ఫుడ్ డెలివరీ కంపెనీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి యాప్ ద్వారా రెస్టారెంట్ నుండి నేరుగా మీ ఇంటికి వేడి,వేడి రుచికరమైన ఆహారాన్ని అందించడానికి పని చేస్తున్నాయి. అయితే, అప్పుడప్పుడు ఫుడ్‌డెలివరీ బాయ్స్‌ చేసే చిన్ని చిన్న పొరపాట్లు ఆయా సంస్థలకు పెద్ద నష్టాన్నే తెచ్చిపెడుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. శాకాహారం ఆర్డర్‌ పెట్టిన కస్టమర్‌కి వెజ్ కాకుండా నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఆ రెస్టారెంట్ పైనే కేసు పెట్టారు. ఈ తప్పిదానికి రెస్టారెంట్ యజమాని భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నివసించే ఓ ఫ్యామిలీ జివాజీ క్లబ్ రెస్టారెంట్ నుంచి వెజిటేరియన్ ఫ్యామిలీ మట్టర్ పన్నీర్ కర్రీ కోసం జొమాటోలోఆర్డర్ ప్లేస్ చేశారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటీవ్ కాసేపట్లో ఫుడ్ పార్శిల్ తీసుకువచ్చి ఇచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మటర్ పన్నీర్ కర్రీ లేదు. బదులుగా చికెన్ కర్రీ కనిపించడంతో ఖంగుతిన్నారు. ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీకి ఈ అనుభవం ఎదురుకావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహంతో మండిపోయారు. ఫిర్యాదు చేస్తే ఈ విషయాన్ని క్లబ్ అధికారులు పట్టించుకోలేదని శ్రీవాస్తవ ఆరోపించారు. దాంతో వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టారు. తమ కుటుంబానికి మానసికంగా, శారీరకంగా నష్టం వాటిల్లిందని వినియోగదారుల ఫోరంలో కంప్లైంట్ ఇచ్చారు.

జివాజీ క్లబ్ మెంబర్, అడ్వకేట్ అయిన సిద్దార్థ శ్రీవాస్తవ కుటుంబానికి ఎదురైన ఘటన ఇది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సిద్ధార్థ్ శ్రీవాస్తవ జివాజీ క్లబ్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. అతను గత నెల 26న జొమాటో ద్వారా క్లబ్‌లోని కిచెన్ నుండి మటర్ పనీర్‌ను ఆర్డర్ చేశాడు. కానీ Zomato నుండి అతనికి డెలివరీ చేయబడిన ఆహారం నాన్ వెజ్. దీంతో సిద్ధార్థ్ శ్రీవాస్తవ క్లబ్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఎవరూ వినకపోవడంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. సేవా లోపం వల్లే ఈ ఘటన జరిగిందని, ఇందుకు నిర్లక్ష్యమే కారణమని కన్స్యూమర్ ఫోరం భావించింది. ఈ ఘటన వల్ల ఫిర్యాదుదారు చాలా రోజులు భోజనం చేయలేకపోయారని, ఈ సంఘటన అతని కుటుంబాన్ని మానసికంగా ప్రభావితం చేసిందని తెలిపింది. ఈ ఘటనతో అతని కుటుంబం మానసికంగా, శారీరకంగా నష్టపోయిందని వినియోగదారుల ఫోరం నిర్ణయానికి వచ్చింది. కన్స్యూమర్ ఫోరమ్ క్లబ్‌లోని రెస్టారెంట్‌కు రూ.20,000 జరిమానా విధించింది. అంతేకాదు… ఈ కేసుపై పోరాడేందుకు ఫిర్యాదుదారు చేసిన ఖర్చును కూడా చెల్లించాలని క్లబ్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి