Viral Video: వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజ‌న్లు ఫిదా..! రీల్స్‌ కోసం ఏం చేశారంటే..

|

Aug 28, 2024 | 11:02 AM

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గ్రామంలోని మట్టితో కట్టిన పూరింట్లో ఒక జంట నివసిస్తోంది. ఇద్దరూ పెద్దవారే.. కానీ, వీళ్లు సరదాగా రీల్స్‌ చేస్తున్నారు. ఇందులో బాగంగా ఆ వృద్ధ దంపతులు

Viral Video: వృద్ధ జంట ఉత్సాహానికి నెటిజ‌న్లు ఫిదా..! రీల్స్‌ కోసం ఏం చేశారంటే..
Reel Of Elderly Village Couple
Follow us on

ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి జనం ఏది చేయడానికైనా వెనుకాడటం లేదు. ఇక రీల్స్ పిచ్చితో ప్రజలు ఎంతకైనా వెళుతున్నారు. కొందరు ఫన్నీ చెష్టలు చేస్తుంటే, మరికొందరు ప్రాణాలకు తెగించి రిస్క్‌ చేస్తున్నారు. రీల్స్‌ కోసం చేసే కొన్ని ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఇష్టంగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఓ వృద్ధ దంపతుల డ్యాన్స్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది మిమ్మల్ని కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక గ్రామంలోని మట్టితో కట్టిన పూరింట్లో ఒక జంట నివసిస్తోంది. ఇద్దరూ పెద్దవారే.. కానీ, వీళ్లు సరదాగా రీల్స్‌ చేస్తున్నారు. ఇందులో బాగంగా ఆ వృద్ధ దంపతులు కోయి పత్తర్ సే నా మారే అనే బాలీవుడ్ పాటపై నటిస్తూ, డ్యాన్స్ చేస్తున్నారు. వీడియోలో ఆ వృద్ధుడు నటిస్తుండగా ఆ పెద్దావిడ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ వృద్ధ జంట డ్యాన్స్ రీల్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో @y_iamcrazyy అనే ఖాతాలో షేర్‌ చేయబడింది. కాగా, నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఇప్పటివరకు ఈ వీడియోను వేల సంఖ్యలో జనాలు వీక్షించారు. చాలా మంది వ్యక్తులు వీడియోను ఇష్టపడ్డారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ పోస్ట్‌పై వ్యాఖ్యానిస్తున్నారు. వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేదు.. వృద్ధులు, విద్యార్థులు అని కూడా లేదు.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ రీల్స్‌కు బానిసలయ్యారు అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..