Viral: గోడౌన్‌లో ఓ చోట కనిపించిన ఎర్ర మట్టి.. 4 అడుగుల గొయ్యి తవ్వగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!

గోడౌన్‌లో ఓ చోట ఎర్ర మట్టి కనిపించింది. అనుమానమొచ్చి అక్కడ 4 అడుగుల గొయ్యి తవ్వగా.. ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాంక్ అయింది..

Viral: గోడౌన్‌లో ఓ చోట కనిపించిన ఎర్ర మట్టి.. 4 అడుగుల గొయ్యి తవ్వగా.. దెబ్బకు ఫ్యూజులౌట్!
Representative Image
Follow us

|

Updated on: Aug 15, 2022 | 5:36 PM

ఓ వ్యక్తికి రోడ్డు పక్కన బురదలో మొబైల్ ఫోన్ కనిపించింది. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఛార్జ్ చేశాడు.. అనంతరం ఆన్ చేయగా.. కొద్దిసేపటికి ఎవరో తలుపు తడుతున్నట్లు శబ్దం అయింది. సీన్ కట్ చేస్తే.. డోర్ తీయగా.. అతడికి ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఆ కథేంటంటే..!

హర్యానాలోని ఆల్వార్‌కు చెందిన మెటల్ వ్యాపారి మంగళ్ అరోరా మిస్సింగ్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. రేవారికి చెందిన అంకిత్ భలియా తన ఇద్దరు సహచరులతో కలిసి మంగళ్ అరోరాను హత్య చేయడమే కాకుండా.. తన గోడౌన్‌లో నాలుగడుగులు గొయ్యి తవ్వి.. మృతదేహాన్ని పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పాతిపెట్టేందుకు.. తన సహచరులు ఒక్కొక్కరి రూ. 3 లక్షలు అంకిత్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మంగళ్ అరోరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఖాకీలు.. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

రేవారీకి చెందిన అంకిత్ భలియా తీసుకున్న డబ్బులు తిరిగిస్తానని.. ఈ ప్లేస్‌కి రావాలంటూ మంగళ్ అరోరాకు ఆగష్టు 10వ తేదీన ఫోన్ చేశాడు. అతడు చెప్పినట్లుగానే మంగళ్ అరోరా ఢిల్లీ రోడ్డులోని ఉత్తమ్ నగర్‌ ఉన్న రేవారీ గోడౌన్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో తన ప్లాన్ ప్రకారం.. తన ఇద్దరు సహచరులతో కలిసి మంగళ్ అరోరాను ఓ కుర్చీకి కట్టేసి.. పదునైన తీగతో అతడి గొంతుకోసి హత్య చేశాడు అంకిత్. మృతదేహం పోలీసులకు చిక్కకూడదన్న ఉద్దేశంతో.. ఆ గోడౌన్‌లోనే నాలుగు అడుగుల గొయ్యి తవ్వి పాతిపెట్టాడు.. దానిపై ఫ్లోరింగ్ వేశారు. అనంతరం పోలీసులు విచారణ నిమిత్తం రాగా.. తన దగ్గర నుంచి రూ. 12 లక్షలు తీసుకుని మంగళ్ అరోరా వెళ్ళిపోయాడంటూ అంకిత్ భలియా తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. మంగళ్ అరోరా మొబైల్ ఫోన్ ఆదివారం రాత్రి గురుగ్రామ్‌ సమీపంలో ఆన్ కాగా.. దాని లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం మొత్తం బట్టబయలైంది.

కాగా, అంకిత్ భలియా ఇవ్వాల్సిన రూ. 35 లక్షలు తీసుకోవడానికి రేవారీకి వెళ్లిన మంగళ్ అరోరా.. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆల్వార్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అల్వార్ పోలీసులు.. కేసును రేవారీ పోలీసులకు అప్పగించగా.. వారు ఐదు రోజుల వ్యవధిలో నిందితులను పట్టుకుని కేసు క్లోజ్ చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు