అరుదైన, పాత నాణేలు వాటి విలువ కంటే చాలా రెట్లు ఎక్కువ అమ్ముతారని మనం చాలా చదవి ఉంటాము. అంటే, 1 రూపాయల పాత నాణెం కోసం ప్రజలు అనేక సార్లు వేల రూపాయలు ఇస్తారు. మనం చాలాసార్లు చూస్తుంటాం.. అరుదైన పాత నాణేలు వాటి విలువ వేలల్లో ఉంటుంది..? లేదా లక్షల్లో ఉంటుంది? కానీ అమెరికాలో ఓ బంగారు నాణెం ఏకంగా రూ.14 కోట్లు పలికి హిస్టరీ క్రియేట్ చేసింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ స్టువార్ట్ వీట్జమన్‌కు చెందిన ఈ డబుల్ ఈగల్ నాణేన్ని వేలం వేశారు. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెంను న్యూయార్క్‌లో వేలం వేయగా.. గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక ధరకు అమ్ముడు పోయింది. సోథెబై వేలంలో ఈ నాణెం రూ.73 కోట్ల నుంచి రూ.100 కోట్ల మధ్య అమ్ముడవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ నాణెం ధర కొత్త రికార్డు సృష్టించింది. 1933 నాటి డబుల్ ఈగిల్ బంగారు నాణెన్ని 18.9 మిలియన్ డాలర్లకు ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఇది భారత కరెన్సీలో దాదాపు రూ.138 కోట్లు.
రాయిటర్స్ యొక్క నివేదిక ప్రకారం,1933 సంవత్సరంలో బంగారంతో తయారు చేయసిన ఈ నాణెంను ముంద్రించారు. ఈ నాణెంను డబుల్ ఈగిల్ కాయిన్ అని పిలుస్తారు. 20 డాలర్ల ఈ బంగారు నాణేలను 1933లో తయారుచేశారు. అదే సమయంలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక మంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ రూజ్‌వెల్ట్ ఈ డబుల్ ఈగల్ నాణేలను చలామణికి విడుదల చేయకుండా నిలిపివేశాడు. అధిక విలువ కారణంగా యునైటెడ్ స్టేట్స్లో చెలామణిలో ఉన్న చివరి బంగారు నాణెం ఇది అని చాలామంది నమ్ముతారు. అనంతరం ఈ నాణాలను కరిగించమని ఆదేశించాడు. ఆ సమయంలో మార్కెట్‌లోకి వచ్చిన రెండు కాయిన్లలో ఇది ఒకటి. డబుల్ ఈగిల్ కాయిన్ పై ఒకవైపు లేడీ లిబర్టీ, మరో వైపు అమెరికన్ ఈగిల్ బొమ్మలు ముద్రించి ఉన్నాయి.
నివేదిక ప్రకారం, ఈ నాణెం షూ డిజైనర్ మరియు కలెక్టర్ స్టువర్ట్ వైట్జ్మాన్ వద్ద ఉంది. స్టువర్ట్ వైట్జ్మాన్ దానిని 2002లో 55 కోట్లకు కొనుగోలు చేశాడు. దీనితో పాటు, అతను ఓ స్టాంప్ కూడా కలిగి ఉన్నాడు. అతను ఆ టికెట్‌ను రూ .60 కోట్లకు విక్రయించాడు. దక్షిణ అమెరికా దేశం ముద్రించిన ఏకైక స్టాంప్ ఇది అని నివేదిక పేర్కొంది. అదే సమయంలో, వైట్జ్మాన్ చిన్నతనం నుండి నాణేలు మరియు స్టాంపులను సేకరించడం హాబీ.. అదే ఈ రోజు అతడిని కుబేరిడిగా మార్చేసింది.