Viral Video: హఠాత్తుగా చూస్తే గడ్డిలా కనిపించే అరుదైన పాము.. పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు అప్పగింత.. వీడియోపై లుక్ వేయండి..

ఒక వింతైనా అరుదైన పాముకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో గడ్డిలా కనిపించే ఒక జీవి ఉంది. అయితే అది పాము అని పరిశీలిస్తే తెలుస్తుంది. మీడియా కథనాల ప్రకారం ఈ పాము థాయ్‌లాండ్‌లో కనుగొనబడింది. దీని రంగు, రూపం చూసి ఎవరైనా సరే మనసులో భ్రమ పడతారు. చూడగానే చిన్న గడ్డిమోపు చూస్తున్నట్టు అనిపిస్తుంది.

Viral Video: హఠాత్తుగా చూస్తే గడ్డిలా కనిపించే అరుదైన పాము.. పరిశోధన కోసం శాస్త్రవేత్తలకు అప్పగింత.. వీడియోపై లుక్ వేయండి..
Puff Faced Water Snake

Updated on: Oct 07, 2023 | 11:17 AM

ప్రపంచంలో అనేక జీవులున్నాయి. వాటిల్లో ఒకటి పాములు. ప్రకృతిలో అనేక రకాల పాములు కనిపిస్తాయి.  వాటిలో కొన్ని చాలా విషపూరితమైనవి .. ప్రమాదకరమైనవి. అదే సమయంలో కొన్ని రకాల పాములు విషరహితమైనవి. ఇతర జీవులకు వీటి వలన ఎటువంటి ప్రమాదం ఉండదు. అయితే కొన్ని రకాల పాములను పుస్తకాల్లో చూస్తాం కానీ.. అవి కంటికి కనిపించడం బహు అరుదని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే అరుదైన వింతగా ఉండే పాములు మన ముందుకు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతాం. అలాంటి ఒక వింతైనా అరుదైన పాముకి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో గడ్డిలా కనిపించే ఒక జీవి ఉంది. అయితే అది పాము అని పరిశీలిస్తే తెలుస్తుంది.

మీడియా కథనాల ప్రకారం ఈ పాము థాయ్‌లాండ్‌లో కనుగొనబడింది. దీని రంగు, రూపం చూసి ఎవరైనా సరే మనసులో భ్రమ పడతారు. చూడగానే చిన్న గడ్డిమోపు చూస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇది పాము. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ గురయ్యారు.

ఇవి కూడా చదవండి

దుబ్బు గడ్డితో నిండి ఉన్న ఈ నాచు పచ్చ రంగులో ఉన్న ఈ పాము థాయ్‌లాండ్‌లో కనిపించింది. డ్రాగన్ లాంటి ఈ జీవి 60 సెంటీ మీటర్ల పొడవు ఉంటుంది. ఈ వీడియో పఫ్-ఫేస్డ్ వాటర్ పామును చూపిస్తుంది. ఈ పాము చిత్తడి నేలలోని లోతులేని నీటిలో, రాతి పగుళ్లలో జీవిస్తుంది. ఈ పాముని ఒక చూసి వ్యక్తి తన ఇంటికి తీసుకుని వెళ్లి.. ఒక చోట పెట్టి చేపలను ఆహారంగా వేశాడు. ఈ పాముని ఇప్పుడు అతను పరిశోధన నిమిత్తం శాస్త్రవేత్తలకు అప్పగించనున్నాడు

ది సైన్స్ టైమ్స్ ప్రకారం ఈ పాము గడ్డిలా కనిపించే బొచ్చుతో ఉంటుంది. ఎక్కువగా నీరు ఉన్న ప్రదేశంలో నివసిస్తుంది. దాని శరీరం కారణంగా ఈ పాము తనను వేటాడే వారి నుంచి సులభంగా తప్పించుకుంటుంది. అంతేకాదు వీటిని పఫ్-ఫేస్డ్ పాములు అని కూడా పిలుస్తారు. ఈ పాములు ఇతర పాముల కంటే తక్కువ విషపూరితమైనవి. కానీ ఇవి మానవులకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ వీడియో X వినియోగదారు @Humanbydesign3 ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి పాముని చూడలేదని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..