వన్యప్రాణులు నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు గతంలో ఎప్పుడూ జంతువులు కూడా అడవుల్లో తిరుగుతుంటాయి. అలాంటి వాటిని ఎప్పుడైన సోషల్ మీడియా ద్వారా చూసినప్పుడు మీరు ఆశ్చర్యపోవటం కాయం. తాజాగా అలాంటిదే ఒక జంతువుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ట్విట్టర్ యూజర్ @Gabriele_Corno పోలాండ్‌లోని బారిజీ లోయలో కనిపించిన అరుదైన నల్ల జింక వీడియోను పోస్ట్ చేశారు. షేర్ చేసిన కొద్దికాలంలోనే వైరల్‌గా మారింది. వీడియో 124,000 కంటే ఎక్కువ వీక్షణలను పొందింది. అతి తక్కువ నిడివితో, ఆకర్షణీయమైన క్లిప్‌ను చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక అందమైన నల్ల జింక అడవిలో తిరుగుతూ కనిపించింది. జింక జాతిలో అరుదైన రంగుతో కనిపించిన ఈ జంతువు నెటిజన్లను మంత్రముగ్దులను చేస్తుంది. క్యాప్షన్ ప్రకారం, కృష్ణ జింక పోలాండ్‌లోని బారిజీ లోయలో కనిపించింది. దీనిని చూడటం నిజంగా ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు.
Rare black fallow deer seen in the Baryczy valley in Poland.
? tanczacachmura pic.twitter.com/1n0SdUikOH— Gabriele Corno (@Gabriele_Corno) March 31, 2023
మార్చి 31న ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌కి 124k కంటే ఎక్కువ వీక్షణలను సంపాదించింది. అరుదైన కృష్ణ జింకను చూసి నెటిజన్లు ముగ్ధులయ్యారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందించారు. సంవత్సరం సమయాన్ని బట్టి ఇలాంటి జింక రంగు మారుతుంది. వేసవిలో ఇది ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. ఎగువ భాగంలో తెల్లటి మచ్చలు ఉంటాయి. తోక కొన, దిగువ కాళ్ళు రంగులో తేలికగా ఉంటాయి. శీతాకాలంలో తల, మెడ, చెవులు ముదురు గోధుమ, నలుపు రంగులో ఉంటాయని చెప్పారు. ఇలా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..