Viral News: సరదాగా ఏవైనా ఆహార పోటీలంటే ఆహార ప్రియులు ముందువరుసలో ఉంటారు. ఆఛాలెంజ్ గెలవలేమని తెలిసినా.. సరదా కోసం ఆహార పోటీల్లో పాల్గొంటారు. కొన్ని రెస్టారెంట్లు ఈఆహార పోటీలను, ఫుడ్ ఛాలెంజ్ లను నిర్వహించడం చూస్తుంటాం. చాలా చోట్ల కస్టమర్లను ఆకర్షించేందుకు ఫుడ్ చాలెంజ్ లు నిర్వహిస్తూ ఉంటారు. ఈఛాలెంజ్ పూర్తి చేస్తే ఆకర్షణీయమైన బహుమతులతో పాటు.. కొన్ని సార్లు నగదు బహుమతులు ఇస్తుంటారు.
ఈఫుడ్ ఛాలెంజ్ లో ఆహార పదార్థాలను చెప్పిన సమయంలోపు పూర్తి చేస్తే నగదు బహుమతులు ఇవ్వడం చూస్తాం. ఢిల్లీలోని పలు చోట్ల ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్‌లు రెగ్యులర్ గా నిర్వహిస్తుంటారు. అలాంటి.. సంఘటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌నీశ్ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్‌బుక్ పేజీ, యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. ఇచ్చిన ఛాలేంజ్‌ను పూర్తి చేసి నగదు గెలుచుకోవటమే అతడు పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని వైరల్‌గా మారినవిషయం తెలిసిందే. ఆ ఛాలేంజ్ పూర్తి చేయటం ద్వారా బులెట్ బైక్ గెలుచుకున్నాడు. అయితే ఆ బైక్‌ను తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు.
ఇప్పుడు మరోసారి ఈ బ్లాగర్ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్ ఫుడ్ ఛాలేంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా పది లక్షల మందికి పైగా వీక్షించారు. ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్ ఓనర్ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు అతగాడు రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడట. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు బ్లాగర్. అందుకు గానూ రెస్టారెంట్ ఓనర్ వద్ద రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ఇటీవల కాలంలో ఫుడ్ ఛాలెంజ్ లతో రాజ్ నీశ్ జ్ఞాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..