మొసలి పంటికి చిక్కిన పైథాన్‌.. హోరాహోరీ పోరులో గెలిచింది ఎవరో చూస్తే..

సోషల్ మీడియాలో ఒక భయానక దృశ్యం వైరల్‌గా మారింది. ఒక భారీ పైథాన్, మొసలి మధ్య పోరాటం జరిగితే అలా దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి? ఆ ఊహా కూడా భయంకరంగా ఉంటుంది. కానీ, అలాంటి భయానక దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఒక పెద్ద మొసలి, భారీ కొండచిలువ మధ్య జరిగిన పోరాట వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు.

మొసలి పంటికి చిక్కిన పైథాన్‌.. హోరాహోరీ పోరులో గెలిచింది ఎవరో చూస్తే..
Python Crocodile Fight

Updated on: Nov 05, 2025 | 5:12 PM

మొసళ్ళు, పైథాన్లు రెండూ క్రూరమైన జీవులే. అందుకే ప్రజలు వాటికి దూరంగా ఉంటారు. ఈ ప్రమాదకరమైన జీవులకు తాము ఎప్పుడూ ఎదురుపడకూడదని కోరుకుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఈ రెండు ప్రమాదకర జీవులు ఎదురుపడ్డ దృశ్యాన్ని చూశారా… అవును, సోషల్ మీడియాలో ఒక పెద్ద కొండచిలువ, క్రూరమైన మొసలి ఎదురుపడినప్పుడు వాటి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ రెండు జీవుల మధ్య పోరాటానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో మొసలికి ఎదురు వెళ్లిన కొండచిలువ తన ప్రతాపం చూపించాలనుకుంది.. కానీ, ఆ మొసలి దాని తన దవడలలో గట్టిగా పట్టేసింది. కొండచిలువలు వేటాడే జంతువులకు ముప్పుగా ఉన్నప్పటికీ, ఈసారి అది మొసలి పట్టులో చిక్కుకుంది. కొండచిలువ తనను తాను విడిపించుకోవడానికి తన శక్తినంతా ఉపయోగించి ప్రయత్నిస్తుంది. అప్పుడప్పుడు తన శరీరాన్ని మొసలి చుట్టూ చుట్టి ప్రతీకారం తీర్చుకుంటుంది. కానీ, ఫలితం కనిపించలేదు..

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

ఈ భయంకర వీడియో చూస్తుంటే.. ఒళ్లు గగ్గుర్పాటుకు గురవుతుంది. వెన్నులో వణుకుపుడుతుంది. కానీ, కొండచిలువ జీవించాలనే సంకల్పాన్ని చివరి వరకు ప్రదర్శిస్తుంది. ఈ వీడియోను బెన్నీ సాల్జర్, జూలియన్ గీర్ట్స్ రికార్డ్ చేశారు. రెండు జంతువుల బలం, దూకుడు చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఆశ్చర్యకరమైన కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..