Watch: 24గంటలు గడవక ముందే మరో ప్రమాదం.. టిప్పర్ బీభత్సంతో 10 మంది మృతి!.. షాకింగ్ వీడియో
Jaipur Road Accident: జైపూర్‌లో మరో ప్రమాదం వెలుగు చూసింది. ఒక టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజస్థాన్‌లో వరుసగా రెండో రోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్మారా పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహా మండి ప్రాంతంలో ఒక టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. లోహా మండి ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్ అదుపుతప్పి బాటసారులతో సహా అనేక వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 10 మంది మరణించారు. మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు. టిప్పర్ సృష్టించిన బీభత్సానికి సుమారు 10కిపైగ వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. సోమవారం మధ్యాహ్నం హర్మాడా పీఎస్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. లోహా మండీ నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక టిప్పర్.. అదుపుతప్పి రోడ్డు వెళ్తున్న వాహనాలను జనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది సహా 10 వాహనాలు ధ్వంసం అయ్యాయి. వీటిలో ఎక్కువగా బైక్‌లు, కార్లు, ఆటోలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరణించిన మృతదేహాలను స్వాదీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
వీడియో చూడండి..
जयपुर में भीषण सड़क हादसा। हादसे में 10 लोंगो की मौत की आशंका। अनियंत्रित डंपर ने कार को मारी जोरदार टक्कर। टक्कर के बाद डंपर तीन गाड़ियों पर पलट गया। आधा दर्जन से ज़्यादा गाड़ियों की हुई जोरदार भिड़ंत।#Accident #CCTV #Jaipur #Rajasthan pic.twitter.com/U3S0524sDp
— Naresh Parmar (@nareshsinh_007) November 3, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
