AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో దారుణంగా చంపిన పనిమనిషి.. వీడియో వైరల్‌

ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి పుష్పలత లిఫ్ట్‌లో పెంపుడు కుక్కను నేలకేసి బాది కిరాతకంగా చంపేసింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఘటన రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు జంతు హింస కేసు నమోదు చేసి, పోలీసులు పుష్పలతను అరెస్ట్ చేశారు. ఆమె కుక్కను ఎందుకు చంపిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో దారుణంగా చంపిన పనిమనిషి.. వీడియో వైరల్‌
Maid Kills Pet Dog
Jyothi Gadda
|

Updated on: Nov 03, 2025 | 9:25 PM

Share

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాగలూరు ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒక ఇంట్లో పనిచేసే పనిమనిషి పుష్పలత లిఫ్ట్‌లో పెంపుడు కుక్కను నేలకేసి బాది కిరాతకంగా చంపేసింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ ఘటన రికార్డైంది. కుక్క యజమాని ఫిర్యాదు మేరకు జంతు హింస కేసు నమోదు చేసి, పోలీసులు పుష్పలతను అరెస్ట్ చేశారు. ఆమె కుక్కను ఎందుకు చంపిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

చనిపోయిన పెంపుడు కుక్క యజమాని రాశి పూజారి ఈ చర్యకు పాల్పడిన పనిమనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందిరాలికి కుక్కను చూసుకోవడానికి ప్రత్యేకంగా పుష్పలతను నియమించుకున్నారు. ఇందుకు గానూ ఆమెకు జీతం ఇస్తున్నారు. ఆమెకు యజమాని ఇంట్లోనే వసతి, ఆహారం కూడా అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితురాలు కుక్కను వాకింగ్‌ కోసం తీసుకెళ్తున్న క్రమంలనే ఇంతటి దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన అక్టోబర్ 31న జరిగింది. కానీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంపుడు జంతువును చంపిన తర్వాత, ఆ మహిళ చనిపోయిన కుక్కపిల్లని ఒక చేతిలో ఎత్తుకుని లిఫ్ట్ నుండి బయటకు నడుచుకుంటూ వెళ్తుండటం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది.

ఆ సీసీటీవీ క్లిప్ వైరల్ కావడంతో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ మహిళ ఆ చిన్న కుక్కను ఊపుతూ, పదే పదే దాని పట్టీతో నేలకేసి కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..