Viral Video: వారెవ్వా.. జిమ్ కు వెళ్లకుండానే ఇరగదీశాడుగా.. గిన్నిస్ రికార్డు సొంత చేసుకున్న పంజాబ్ యువకుడు
ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే.. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. విజయం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాం. లక్ష్యం బలంగా లేకపోతే ఒకసారి ఓటమి ఎదురైతే.. ఇక మనవల్లకాదులే

Viral News: ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే.. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. విజయం సాధించేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాం. లక్ష్యం బలంగా లేకపోతే ఒకసారి ఓటమి ఎదురైతే.. ఇక మనవల్లకాదులే అనుకుంటూ.. వెనకడుగు వేస్తాం. సాధారణంగా ఓటమి గెలుపునకు నాంది అంటారు. అంటే ఓ సారి ఓటమి ఎదురైనా.. అది నేర్పిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ..గెలుపు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్యం నుంచి వెనక్కి వెళ్లిపోకుండా అది సాధించేవరకు పోరాడితే అలవోకగా గెలుపు మన సొంతమవుతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా పంజాబ్ కు చెందిన ఓ యువకుడు సాధించిన ఎచీవ్ మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయువకుడు నెటిజన్ల నుంచి సర్వత్రా అభినందనలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఈ పంజాబీ యువకుడు ఏం సాధించాడనుకుంటున్నారా.. రీడ్ దిస్ స్టోరీ..
శారీరక ధారుడ్యం కోసం పుష్ అప్ లు చేయడం మనందరికి తెలుసు.. సాధారణంగా ఇవి చేయడానికి ఎంతో కష్టపడతూ ఉంటాం.. సాధన లేకుండా ఇవి చేయడం సాధ్యం కాదు. దీనికోసం ఎంతో పరిశ్రమించాలి కూడా.. అదే పుష్-అప్ లు చేస్తూ మధ్యలో రెండు చేతులు జోడించి చప్పట్లు కొట్టడం అంటే.. అసలు సాధ్యం కాని పని అనుకుంటాం.. ఎందుకంటే సపోర్ట్ లేకుండా పుష్ అప్ లు చేయడం కష్టం.. కాని పంజాబ్ కు చెందిన కువార్ అమృత్ బీర్ సింగ్ దీనిని సాధ్యం చేసి చూపించాడు. చప్పట్లు కొడుతూ.. ఒక నిమిషంలో అత్యధిక పుష్-అప్ లు చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 19 ఏళ్ల కువార్ అమృత్‌బీర్ సింగ్ ఒక నిమిషం వ్యవధిలో చప్పట్లు కొడుతూ.. 45 పుష్-అప్ లు చేసి రికార్డు సృష్టించాడు. ఎప్పుడూ జిమ్‌కు వెళ్లని ఈయువకుడు పుష్-అప్ ల ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించి అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే దీని కోసం అమృత్ బీర్ సింగ్ ఎంతో పరిశ్రమించాడు. మొదట విఫలమైనా.. నిరాశ చెందకుండా రెండోసారి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నం ఫలించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.




View this post on Instagram
కువార్ అమృత్‌బీర్ సింగ్ గిన్నిస్ రికార్డు కోసం 2021 నవంబర్ లో మొదటిసారి ప్రయత్నించాడు. అప్పుడు తన ప్రతిపాదన తిరస్కరణకు గురికావడంతో ఎంతో నిరాశచెందాడు. అయినా అక్కడితో ఆగకుండా గిన్నిస్ రికార్డు కోసం రెండోసారి దరఖాస్తు చేయగా.. అతడి ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో చప్పట్లు కొడుతూ ఒక నిమిషంలో 45 పుష్-అప్ లు చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ఈలక్ష్యాన్ని సాధించడానికి కేవలం తాను 21 రోజులు మాత్రమే సాధన చేశానని చెప్పుకొచ్చాడు ఈ పంజాబీ యంగ్ స్టార్. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో వీడియోను షేర్ చేయగా.. సోషల్ మీడియాలో ఈవీడియో వైరల్ గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..