
సీతా ఎయిర్‌లైన్స్‌కు చెందిన చిన్న విమానం నేపాల్‌గంజ్ నుంచి డోల్పాకు బయలుదేరింది. విమానంలో 13 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. జుఫాల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం కుడివైపు టైర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. దీంతో విమానం పెద్ద కుదుపుతో రన్‌వేపైనే ఆగిపోయింది.
విమానం టైర్ ఊడిపోయిన వెంటనే పైలట్ ఇంజిన్‌ను వెంటనే ఆపేశారు. దీంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారకుండా నియంత్రించగలిగారు. విమానం రన్‌వేపైనే నిలిచిపోయినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు .విమానానికి కూడా పెద్దగా నిర్మాణపరమైన నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. టైర్ ఊడి విమానం అదుపు తప్పి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండేది. అయితే పైలట్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Sita Airplane Loses Wheel During Landing At Juphal Airport
అయితే ప్రమాదం తప్పినా మరో సమస్య మొదలైంది. విమానం రన్‌వే పైనే నిలిచిపోవడంతో జుఫాల్ విమానాశ్రయంలో అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి వస్తున్న నేపాల్ ఆర్మీకి చెందిన ఓ విమానం అత్యవసర పరిస్థితి కారణంగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. రన్‌వేపై ఉన్న విమానాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విమానాన్ని రిపేర్ చేసేందుకు అవసరమైన సాంకేతిక నిపుణులను హెలికాప్టర్ ద్వారా తరలించారు. విమానం తొలగించిన తర్వాత రన్‌వే పై మరమ్మత్తు పనులు పూర్తి చేసి విమాన సర్వీసులను సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ల్యాండింగ్ సమయంలో టైర్ ఊడిపోయి ఒక్కసారిగా ఉత్కంఠ రేపిన ఈ ఘటనలో పైలట్ అప్రమత్తతతో 16 మంది సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది
మరిన్ని ట్రెండింగ్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి